ఎఫ్‌బీ అకౌంట్‌ శాశ్వతంగా డిలిట్‌ ఇలా

ABN , First Publish Date - 2021-07-17T06:13:20+05:30 IST

ఈ కొవిడ్‌ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఫేస్‌బుక్‌ మంచి కాలక్షేప బఠాని. కాలాన్ని బలవంతంగా కాకుండా, కూస్తంత ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేందుకూ ఉపయోగపడుతోంది.

ఎఫ్‌బీ అకౌంట్‌ శాశ్వతంగా డిలిట్‌ ఇలా

కొవిడ్‌ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఫేస్‌బుక్‌ మంచి కాలక్షేప బఠాని. కాలాన్ని బలవంతంగా కాకుండా, కూస్తంత ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేందుకూ ఉపయోగపడుతోంది. కొంత చెత్త పోగవుతున్నా,  ఎఫ్‌బీలో వినోదం, విజ్ఞానం అస్సలు లేదని చెప్పలేం. అయితే ఫేస్‌బుక్‌లో సమయం అపరిమితంగా వృథా అవుతోంది అనే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. కారణాలు ఏమైతేనేం, ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించుకోవాలంటే ఒక పద్ధతి ఉంది. అయితే అందులో ఉన్న సమాచారం ఇక లభ్యం కాదని గుర్తుంచుకోవాలి. మళ్లీ భవిష్యత్తులో అకౌంట్‌ కావాలనుకుంటే ఫ్రెష్‌గా సరికొత్త ఐడీతో ఓపెన్‌ చేయాల్సిందే.  శాశ్వతంగా తొలగించుకోవాలంటే మాత్రం.


శాశ్వతంగా తొలగింపు

ఓపెన్‌బుక్‌ ప్రొఫైల్‌ను ఓపెన్‌ చేయాలి. 

మెయిన్‌ ప్రొఫైల్‌ నుంచి ఎఫ్‌బీ ప్రొఫైల్‌ కుడివైపు కార్నర్‌లో క్లిక్‌ చేయాలి.

సెట్టింగ్స్‌ అండ్‌ ప్రైవసీ సెక్షన్‌లోకి వెళ్ళాలి.

సెట్టింగ్స్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

ఎడమ కాలమ్‌లో ఉన్న మీ ఫేస్‌బుక్‌ ఇన్ఫర్మేషన్‌పై క్లిక్‌ చేయాలి. 

పైవసీ ఆప్షన్‌, ఫేస్‌బుక్‌ ఇన్ఫర్మేషన్‌పై క్లిక్‌ చేయాలి. 

డీయాక్టివేషన్‌, డిలిషన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 

డిలిట్‌ అకౌంట్‌ను ఎంపిక చేసుకుని కంటిన్యూ టు అకౌంట్‌ డిలిషన్‌పై క్లిక్‌ చేయాలి. 

డిలీట్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేసి, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి, కంటిన్యూపై క్లిక్‌ చేయాలి. 


మనసు మార్చుకుంటే

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ శాశ్వతంగా డిలీట్‌ చేసినప్పటికీ కొన్ని రోజుల తరవాత మనసు మార్చుకుంటే అకౌంట్‌ను రీ ఓపెన్‌ చేసుకోవచ్చు. అయితే అందుకు 30 రోజుల గడువు ఉంటుంది. అలా మార్చుకున్న పక్షంలో కేన్సిల్‌ కొట్టి ఫేస్‌బుక్‌లో కంటిన్యూ కావచ్చు. గడువు లోపు కేన్సిల్‌ కొట్టకుంటే అకౌంట్‌ శాశ్వతంగా తెరమరుగవుతుంది. 


తాత్కాలిక విరామం కావాలంటే..

డిలీట్‌ కాకుండా బ్రేక్‌ తీసుకోవాలని అనుకుంటే కింది విధంగా డీయాక్టివేట్‌ కావచ్చు. 

మెయిన్‌ ప్రొఫైల్‌ నుంచి ఫేస్‌బుక్‌ టాప్‌ రైట్‌లో ఉన్న డౌన్‌వార్డ్‌ పాయింటింగ్‌ యారోపై క్లిక్‌ చేయాలి.

సెట్టింగ్స్‌ అండ్‌ ప్రైవసీ ఆప్షన్‌ని సెలెక్ట్‌ చేసుకుని సెట్టింగ్స్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. 

లెఫ్ట్‌ కాలమ్‌లో ఉన్న ఫేస్‌బుక్‌ ఇన్ఫర్మేషన్‌పై క్లిక్‌ చేయాలి. 

డీయాక్టివేషన్‌ అండ్‌ డిలిషన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 

డీయాక్టివేట్‌ అకౌంట్‌ ఆప్షన్‌ని ఎంపిక చేసుకోవాలి.

అకౌంట్‌ డీయాక్టివేషన్‌ కోసం కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. కన్‌ఫర్మ్‌ కోసం ఇన్‌స్ట్రక్షన్స్‌ ఫాలో అవ్వాలి. 

అవసరమైనంత కాలం బ్రేక్‌ తీసుకుని యాక్టివేట్‌ కావచ్చు.

Updated Date - 2021-07-17T06:13:20+05:30 IST