Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 29 Jun 2022 00:16:15 IST

జేమ్స్‌ బాండ్‌ లాంటి కథ ఇది

twitter-iconwatsapp-iconfb-icon

మాధవన్‌ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్‌’. మాధవన్‌, సరితా మాధవన్‌, వర్గీస్‌ మూలన్‌, విజయ్‌ మూలన్‌ నిర్మించారు. జులై 1న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాధవన్‌ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్త ఎదుర్కోని పరిస్థితుల్ని నంబి నారాయణ్‌ ఎదుర్కొన్నారు. ఆయన్ని దేశద్రోహం నేరం కింద అరెస్టు చేశారు. దాదాపు చంపినంత పనిచేశారు. ఆ తరవాత నిర్దోషి అని తేలింది ఆయన కథ వింటే.. జేమ్స్‌ బాండ్‌కి బాబులా అనిపించారు. అందుకే.. దాన్ని సినిమాగా చూపించాలని నిర్ణయం తీసుకొన్నా.  స్వాతంత్య్ర వీరుల గురించి, దేశ భక్తుల గురించి, పౌరాణిక పాత్రల గురించి చాలా సినిమాలు తీశాం. సైన్స్‌, టెక్నాలజీ రంగంలో చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్లందరి గురించీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సినిమా రూపొందించామ’’న్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International