Abn logo
Aug 13 2020 @ 16:44PM

శ్రీదేవి జయంతికి ఇదే ఘన నివాళి: యంగ్ హీరోయిన్

అతిలోకసుందరి శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని యంగ్ హీరోయిన్ ఇషాచావ్లా.. ఓ గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు. మిషన్ గ్రీన్, ముంబై సంస్థ ద్వారా దాదాపు 101 రకాల పండ్ల మొక్కలను ఆమె రైతులకు ఇవ్వబోతున్నారు. తద్వారా ఏర్పడే గ్రీనరి, పొల్యూషన్ లేని పండ్లు, రైతుల కుటుంబాలలో ఆనందం.. వంటివే శ్రీదేవి జయంతి కానుకగా ఆమెకిచ్చే ఘన నివాళి అని ఇషాచావ్లా ప్రకటించింది.

 

‘‘అందరికీ నమస్కారం!

నేను మీ ఇషాచావ్లా. నేడు అతిలోక సుందరి శ్రీదేవి జన్మదినోత్సవం (జయంతి). ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా మిషన్ గ్రీన్, ముంబై ద్వారా దాదాపు 101 రకాల పండ్లమొక్కలు రైతు కుటుంబాలకు అందజేస్తున్నాం. నేను శ్రీదేవిగారిని స్ఫూర్తిగా తీసుకుని పలు రకాల పాత్రలు చేశాను. ఆమె మన జీవితంలో ఓ భాగంగా మారిపోయారు. అలాగే మంచి ఆరోగ్యాన్ని అందించే పండ్లను అందించే చెట్లు కూడా మన జీవితంలో ఓ భాగమే! ఈ పండ్ల చెట్లు వాతావరణంలో పొల్యూషన్‌ను కంట్రోల్ చేస్తాయి. కొన్ని రైతు కుటుంబాలకు ఆదాయం వస్తుంది. ఆయా కుటుంబాలు ఆనందంగా ఉంటాయని నా భావన. గ్రీనరీ పెరుగుతుంది. రైతులకు మంచి జరుగుతుంది. పొల్యూషన్ లేని పండ్లు అందుతాయి.

అందుకే ఆ చాందినిని గుర్తు చేసుకుంటూ, ఆ వెన్నెల రాణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ మా మిషన్ గ్రీన్, ముంబై సంస్థ ద్వారా ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాం. ఇదే మనం ఆమెకు ఇచ్చే ఘన నివాళిగా నేను భావిస్తున్నాను.

ధన్యవాదాలు............ మీ ఇషాచావ్లా!’’ అని యంగ్ హీరోయిన్ ఇషాచావ్లా తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement