Abn logo
Feb 19 2020 @ 23:21PM

నేను మెచ్చిన చిత్రమిది!

‘‘నేను సినిమా చూశా. నచ్చింది! నేను మెచ్చిన చిత్రమిది. ఐదు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకూ వెళ్లింది. మూడు పాత్రలతో కెఎల్‌ ప్రసాద్‌ అద్భుతంగా తీశారు. ప్రతిఒక్కరూ చూడాల్సిన చిత్రమిది’’ అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. విక్రమ్‌ శివ, ప్రగతి యాదాటి జంటగా నటించిన చిత్రం ‘స్ర్కీన్‌ ప్లే’. ‘ఆఫ్‌ ఎన్‌ ఇండియన్‌ లవ్‌ స్టోరీ’... ఉపశీర్షిక. డాక్టర్‌ అరుణకుమారి నిర్మాత. కెఎల్‌ ప్రసాద్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం ప్రసాద్స్‌ గ్రూప్‌ అధినేత రమేశ్‌ ప్రసాద్‌ విడుదల చేశారు. కెఎల్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నేపాల్‌ సినీ విశ్లేషకుడొకరు తెలుగు రాకున్నా... సబ్‌టైటిల్స్‌తో చూసి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు ‘స్ర్కీన్‌ప్లే’ను సిఫారసు చేశాడు. ప్రవేశ రుసుము తీసుకోకుండా చలనచిత్రోత్సవాల నిర్వాహకులు ‘స్ర్కీన్‌ప్లే’ను ఎంపిక చేస్తున్నారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌. నారాయణమూర్తి, విజయేంద్ర ప్రసాద్‌, పరకాల ప్రభాకర్‌, జెకె భారవి, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ తదితరులతో పాటు చిత్రబృందం పాల్గొంది.

Advertisement
Advertisement
Advertisement