నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపిల్ల ఇదే

ABN , First Publish Date - 2021-01-19T06:48:43+05:30 IST

మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన దేశెట్టి ప్రమీల అనే మహిళా ఇంట్లో నాలుగు కాళ్ల కోడిపిల్ల సోమవారం పుట్టింది.

నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపిల్ల ఇదే
నాలుగు కాళ్ల కోడిపిల్ల

నాలుగు కాళ్ల కోడిపిల్ల జననం

సోన్‌, జనవరి 18 : మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన దేశెట్టి ప్రమీల అనే మహిళా ఇంట్లో నాలుగు కాళ్ల కోడిపిల్ల సోమవారం పుట్టింది. గుడ్లను పొదిగి పది కోడిపిల్లలు పుట్టగా అందులో మాత్రం ఒక కోడిపిల్ల నా లుగుకాళ్లతో పుట్టడంతో అందరూ వింతగా చూడటం జ రుగుతోంది. వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పి మాటలు నిజం అవుతున్నాయని వృద్ధులు చర్చించుకుంటున్నారు. కాగా కోడిపిల్ల ఆరోగ్యంగా ఉంది. ఈ విషయమై మండల పశు వైద్యాధికారి మహేష్‌ను సంప్రదించగా జన్యులోపంతో ఎప్పటికైనా ఒకసారి పుట్టడం జరుగుతుందన్నారు. 

Updated Date - 2021-01-19T06:48:43+05:30 IST