క్రీ.పూ 1300 నాటి వంతెన ఇది!

ABN , First Publish Date - 2021-10-30T05:30:00+05:30 IST

ఈమధ్యకాలంలో నిర్మాణ సమయంలోనే కూలుతున్న వంతెనలు చూస్తున్నాం. చిన్నపాటి వరదలకు కొట్టుకుపోతున్న వంతెనల....

క్రీ.పూ 1300 నాటి వంతెన ఇది!

ఈమధ్యకాలంలో నిర్మాణ సమయంలోనే కూలుతున్న వంతెనలు చూస్తున్నాం. చిన్నపాటి వరదలకు కొట్టుకుపోతున్న వంతెనల దృశ్యాలు టీవీల్లో చూస్తున్నాం. కానీ ఈ వంతెన శతాబ్దాలు దాటినా చెక్కు చెదరలేదు. అర్కాడికో బ్రిడ్జ్‌ అని పిలిచే ఈ వంతెన ఇప్పటికీ వినియోగంలో ఉంది. గ్రీసులోని పెలొపొన్నీస్‌లో టిరిన్స్‌ నుంచి ఎపిడౌరోస్‌కు వెళ్లే దారిలో ఉందీ వంతెన. క్రీ.పూ 1300 సంవత్సరంలో ఈ వంతెన నిర్మించినట్టు ఆధారాలున్నాయి. ప్రపంచంలో వినియోగంలో ఉన్న అతి పురాతనమైన వంతెన ఇదే. ఈ వంతెనను 22 మీటర్ల పొడవు, 5.6 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల ఎత్తులో నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్లు, చిన్న రాళ్లు కలిపి వంతెన నిర్మించిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అదీ వేల ఏళ్లు గడిచినా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం.

Updated Date - 2021-10-30T05:30:00+05:30 IST