Abn logo
Sep 25 2021 @ 16:37PM

యూపీఎస్సీలో టాప్... అండగా బీహార్ గ్రూప్

పాట్నా: నిన్న విడుదలైన యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో 761 మంది అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో టాపర్ సహా 25 మందికిపైగా అభ్యర్థులు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ (ఎన్ఏసీఎస్) ఇనిస్టిట్యూట్‌కు చెందిన వారు కావడం గమనార్హం. బీహార్‌లోని కతియార్ జిల్లాకు చెందిన శుభమ్ కుమార్ టాప్ ర్యాంకు సాధించి ఇనిస్టిట్యూట్ పేరును మార్మోగించాడు. మిగతా వారు కూడా మంచి ర్యాంకులు సాధించారు. 


ప్రధాన పరీక్షల్లో అర్హత సాధించిన యూపీఎస్సీ ఔత్సాహికులకు బీహార్, ఝార్ఖండ్‌కు చెందిన ప్రస్తుతం విధుల్లో ఉన్న,  రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఉచితంగా  ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు. యూపీఎస్‌‌సీలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన శుభమ్ కుమార్‌ను న్యూఢిల్లీలోని బీహార్ రెసిడెంట్ కమిషనర్ పాల్కా సాహి అభినందించారు. 


ఎన్ఏసీఎస్‌తో కలిసి పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఇనిస్టిట్యూట్‌కు చెందిన శుభమ్ కుమార్ టాప్ ర్యాంక్ సాధించి ఎన్ఏసీఎస్‌కు మాత్రమే కాకుండా మొత్తం బీహార్, ఝార్ఖండ్‌కు గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు. శుభమ్‌తోపాటు 25 మందికిపై అభ్యర్థులు ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నవారేనని పేర్కొన్నారు. 


బీకే ప్రసాద్ మార్గదర్శకత్వంలో 2014లో 8 మంది అధికారులు కలిసి ఎన్ఏసీఎస్ ఏర్పాటు చేశారు. యూపీఎస్సీ ఔత్సాహికులకు ఇది నిత్యం క్లాసులు నిర్వహిస్తూ ఉంటుంది. ‘‘మొత్తంగా 1000 మందికిపైగా అధికారులు ఎన్ఏ‌సీఎస్‌తో కలిసి పనిచేస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు. ఇందులో బీహార్, ఝార్ఖండ్‌లలో నివసిస్తున్న ఐఏఎస్ అధికారులు ఉన్నారని, అభ్యర్థులు విజయం సాధించేందుకు వారంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారని వివరించారు.


సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కోసం ఐజీపీలో ఈసారి 60 మందికిపై అభ్యర్థులు పాల్గొంటే 25 మందికిపైగా అభ్యర్థులు సివిల్స్ ఎగ్జామ్ పాసయ్యారని తెలిపారు. అభ్యర్థులకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు తీర్చేందుకు ఓ వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని వివరించారు. తమ రాష్ట్రానికి, ఈ సమాజానికి ఎంతోకొంత సేవల చేయాలన్న ఉద్దేశంతోనే అందరం ఒక్కతాటిపైకి వచ్చినట్టు చెప్పారు. ఐఏఎస్ టాప్ ఎన్ఏ‌సీఎస్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వ్యక్తి కావడం తనకు గర్వంగా ఉందని విజయ్ కుమార్ పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...