‘ఈ ప్రభుత్వం అనేకసార్లు అధికారులను తొలగించే ప్రయత్నం చేసింది’

ABN , First Publish Date - 2020-05-29T20:03:13+05:30 IST

జగన్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని..

‘ఈ ప్రభుత్వం అనేకసార్లు అధికారులను తొలగించే ప్రయత్నం చేసింది’

అమరావతి: జగన్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని.. ఎన్నికల కమిషనర్‌ను మార్చడం మామూలు విషయం కాదని టీడీపీ నేత శ్రావణ్ కుమార్ అన్నారు. రమేష్ కుమార్‌ను కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలంటే.. స్వతంత్ర్య ప్రతిపత్తికలిగిన ఎన్నికల కమిషన్ ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. 


జగన్ ప్రభుత్వం అధికారులను అత్యంత అవమానకరంగా తీసేయడానికి అనేకసార్లు ప్రయత్నించిందని, ముఖ్య అదికారులను బదిలీలు చేయడానికి యత్నించిందని శ్రావణ్ కుమార్ విమర్శించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై హడావుడి నిర్ణయాలు తీసుకుని ప్రకటించడం, అదే సమయంలో కోడిడ్-19 రావడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. దీంతో ప్రభుత్వం ఆయనపై కక్షకట్టి ప్రత్యేక జీవో తీసుకువచ్చి పదవి నుంచి తొలగించిందని  శ్రావణ్ కుమార్ విమర్శించారు.

Updated Date - 2020-05-29T20:03:13+05:30 IST