Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ జనాన్ని చూడలేదు

twitter-iconwatsapp-iconfb-icon
టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ జనాన్ని చూడలేదు కియ వద్ద మాట్లాడుతున్న సవిత

మూడేళ్ల వైసీపీ పాలనలో ఏంచేశారో సమాధానం చెప్పాలి?

- సోమందేపల్లి ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు


హిందూపురంటౌన, మే 20: టీడీపీ ఆవిర్భావం నుండి    చంద్రబాబుకు ఇంతపెద్దఎత్తున జన నీరాజనం పలకడం ఇదే మొదటి సారి అని టీడీపీ రాయలసీమ ఇనచార్జ్‌, మా జీమంత్రి అమర్నాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సోమందేపల్లిలో జరిగిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన  మాట్లాడారు. కడప, కర్నూలు, అనంతపురంలో చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూస్తే... ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. ఇదే సోమందేపల్లి లో అప్పటి ప్రతిపక్షనాయకుడు జగన్మోహనరెడ్డి అందరి త లలపై ముద్దులు పెట్టాడు.. అధికారంలోకి వచ్చాక వారి త లలపైనే చేతులు పెట్టి నాశనం చేస్తున్నారని మండిపడ్డా రు. అప్పట్లో ఎక్కడికి వెళ్లినా టీడీపీ ప్రభుత్వంపై బాదుడేబాదుడు అంటూ విమర్శించిన జగన... ప్రస్తుతం ఆయన చేస్తోంది ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే ఏడుసార్లు విద్యుత చార్జీలు పెంచి, మూడేళ్లలో ఒక డ్రిప్‌పైపు, వ్యవసాయ పరికరాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన పాలనలో చే సింది ఒక్కటే... ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడమేనని అన్నారు. 


ప్రజా వేదికను కూల్చడంతోనే.. జగన పతనం ప్రారంభం

గుండుమల తిప్పేస్వామి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

అమరావతిలో ప్రజావేదికను కూల్చడంతోనే జగన్మోహనరెడ్డి పాలన ప్రారంభమైందని, అక్కడి నుంచే ఆయన పతనానికి కూడా కారణమైంది. రైతుల మోటార్లకు మీటర్లు బి గించి వారి మెడలకు ఉరితాళ్లు  బిగిస్తున్నారు. రాష్ట్రంలో డీ జిల్‌, పెట్రోల్‌ ధరల పెంపుపై ప్రధాని మోదీ ఆందోళన వ్య క్తం చేశారని గుర్తుచేశారు. సీఎం జగన చెవులకు కమ్మలు ఇచ్చి, మెడలో నెక్లీసు లాక్కుంటున్నాడని ఎద్దేవా చేశారు.  పోలీసులు, వలంటీర్లను వెంటబెట్టుకుని మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గడపగడపకు పోతున్నారని వి మర్శించారు. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు.


బాబుకు కన్నీరు పెట్టించిన వారు.. రక్తకన్నీరు చూస్తారు..

ఎంఎ్‌స రాజు, టీడీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు

అసెంబ్లీలో చంద్రబాబుకు కన్నీరు తెప్పించిన వారు.. రక్తకన్నీరు చూస్తారు. అన్నివర్గాలు ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత తో ఉన్నారు. హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల్లో టీడీపీ హయాంలో ఎలా అభివృద్ధి జరిగిందో... ఇప్పుడు ఎ లా ఉందో ప్రజలకు అర్థమవుతోంది. జీతం తీసుకుని వలంటీర్లే ఎమ్మెల్యేలపై తిరగబడుతున్నారు. ప్రజలువారిని బహిష్కరించాలి. సామాజిక న్యాయం పేరుతో చేపడుతున్న వైసీపీ మంత్రుల బస్సు యాత్ర, సామాజిక అన్యాయమైన యాత్రగా అభివర్ణించారు. చిలమత్తూరు లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌ పేరిట తీసుకున్న భూములకు, కర్ణాటక బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.9వేల కోట్లు దోచుకున్నారన్నారు. 


మాయమాటలతో అధికారంలోకి వచ్చారు..

ఈరన్న, మాజీ ఎమ్మెల్యే

జగన 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్రలో ప్రజలకు మాయమాటలుచెప్పి అధికారంలోకి వచ్చాడు. పేద, మధ్య తరగతి ప్రజల నడ్డివిరుస్తున్నారు. రూ.70 ఉన్న వంటనూనె రూ.200 చేసిన ఘనత జగనకే దక్కుతుంది.పంచభూతాలను వైసీపీ నాయకులు అమ్ముకుంటున్నారని విమర్శించారు. 


 దోచుకోవడానికే జగన వచ్చారు..

బీటీ నాయుడు, ఉమ్మడి జిల్లా ఇనచార్జ్‌

జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చింది దాచుకోవడానికి, దోచుకోవడానికే అన్నారు. గడపగడపకూ పోలేక ప్రజాప్రతినిధులు, నాయకులు జంకుతున్నారు. పైన పటారం, లోన లొటారంలా ఉంది. రావాలి జగన అన్న ఉద్యోగులే నేడు.. పోవాలి జగన అంటున్నారంటే ఈపాలన ఎలా ఉందో అర్థమవుతుంది. 


రాష్ట్రంలో రాక్షస పాలన 

కందికుంట వెంకటప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. పేద ప్రజల నుంచి లాక్కుంటున్నారు. ఒక చేత్తో ఇస్తూ, మరో చేత్తో లాక్కుంటున్నారు. ఈపాలనలో ఎవరూ సంతోషంగా లేరు. చంద్రబా బు అసెంబ్లీలో చేసిన శపథం నెరవేరాలంటే మనమంతా కష్టపడి సీఎంగా అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గడ్డకు పరిటాల రవీంద్రను అసెంబ్లీకి పంపిన చరిత్ర ఉందని అన్నారు. 


జగన వైఎ్‌సఆర్‌ కొడుకేనా?

ప్రకాశనాయుడు, చంద్రదండు రాష్ట్ర అధఽ్యక్షుడు

రైతుబిడ్డగా చెప్పుకునే జగన్మోహనరెడ్డి పాలన చూస్తుం టే... రాజశేఖర్‌రెడ్డి కుమారుడేనా? అన్న అనుమానం కల్గుతోంది. చంద్రబాబుకు ఎక్కడ అవమానం జరిగిందో అక్కడికి మనమంతా కష్టపడి గౌరవంగా పంపుదాం. రాక్షస పా లనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, మహిళలపై అఘాయిత్యాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.


టీడీపీ అభివృద్ధి.. వైసీపీకి కాసులు కురిపిస్తోంది..

రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత

పెనుకొండ రూరల్‌: దేశ విదేశాలు తిరిగి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అంతర్జాతీయ కియ కార్లపరిశ్రమ స్థాపనకు చంద్రబాబు కృషి చేస్తే... వైసీపీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. చంద్రబాబు పర్యటన లో భాగంగా కియ కార్లపరిశ్రమ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. కియ స్థాపనకు కృషిచేసిన అపర భగీరథుడు చంద్రబాబును చూసేందుకు కియ కార్మికులు, యువతీ యువకులు పెద్దఎత్తున తరలి వచ్చి స్వాగతం పలికినందు కు సంతోషంగా ఉందన్నారు. కియలో వేలాది మంది ఉద్యోగాలు పొందారు. అలాంటి పరిశ్రమ స్థాపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. జిల్లాను సస్యశ్యామలం చేసిన అపరభగీరథుడు చంద్రబాబు అన్నారు. అభివృద్ధి అంటే టీడీపీ అని, టీడీపీ అంటేనే అభివృద్ధి అన్నారు. 


చంద్రబాబు సభకు తరలిన తెలుగు తమ్ముళ్లు

రొద్దం: సోమందేపల్లిలో శుక్రవారం మాజీ ముఖ్యమం త్రి చంద్రబాబు నాయుడు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వెళ్లారు. బైక్‌లు, వాహనాల్లో ర్యాలీగా వెళ్లారు. మం డలవ్యాప్తంగా సుమారు 5 వేల మంది సభకు హాజరయ్యా రు. టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి జీవీపీ నాయుడు, హిందూపురం పార్లమెంట్‌ అధికార ప్రతినిధి నరసింహు లు, మాజీ జడ్పీటీసీ చిన్నప్పయ్య, మాధవనాయుడు, రామక్రిష్టప్ప, మాజీ కన్వీనర్‌ చంద్రమౌళి, కన్వీనర్‌ నరహరి, వెంకటరామిరెడ్డి, తురకలాపట్నం నాగేంద్ర, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షులు వీరాంజనేయులు, టీఎనఎ్‌సఎ్‌ఫ హిందూపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు హరి, పెనుకొండ అసెంబ్లీ అధ్యక్షులు వాల్మీకి చంద్రశేఖర్‌, పుల్లప్పచౌదరి, రొద్దకంపల్లి నాగరాజు, నారాయణ తదితరులు తరలి వెళ్లారు. 


మడకశిర టౌన: మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు సోమందేపల్లిలో చేపట్టిన బాదుడే బాధుడు కార్యక్రమానికి శుక్రవారం మడకశిర నియోజకవర్గ వ్యాప్తం గా జనం భారీగా తరలివెళ్లారు. దాదాపు 200 వాహనాల్లో  ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్నల అధ్వర్యంలో వేర్వేరుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. చంద్రబాబు నాయుడు పర్యటనతో తెలుతమ్ముళ్లలో నూతనోత్సాహం నెలకొంది. 


 పెనుకొండ రూరల్‌: మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనకు భారీగా తరలి వెళ్లారు. సోమందేపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని వేలాదిగా చేరుకుని విజయవంతం చేశారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.