ఈ గుడ్డు వెయ్యేళ్ల నాటిది!

ABN , First Publish Date - 2021-06-12T05:30:00+05:30 IST

వెయ్యేళ్ల క్రితం గుడ్డు ఇప్పటికీ అలాగే ఉంది. ఇజ్రాయిల్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు జరుపుతున్న

ఈ గుడ్డు వెయ్యేళ్ల నాటిది!

వెయ్యేళ్ల క్రితం గుడ్డు ఇప్పటికీ అలాగే ఉంది. ఇజ్రాయిల్‌లో పురావస్తు శాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాల్లో ఈ గుడ్డు బయటపడింది. ఆ విశేషాలు ఇవి....


ఇజ్రాయిల్‌లోని పురాతన ఇండస్ట్రియల్‌ జోన్‌ ప్రాంతంలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఆ తవ్వకాల్లో ఒకచోట కోడిగుడ్డు బయటపడింది. 


వెయ్యేళ్లు గడిచినా కోడిగుడ్డు పగిలిపోకుండా ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. మెత్తటి వ్యర్థాలలో చుట్టి ఉండటం వల్ల గుడ్డు పగలకుండా ఉంది. అధికారులు దాన్ని జాగ్రత్తగా బయటకు తీసే క్రమంలో కొద్దిగా పగుళ్లు వచ్చాయి. అయితే అధికారులు సొనలోని డిఎన్‌ఏ సేకరించి విశ్లేషణ కోసం భద్రపరిచారు. 


‘‘తవ్వకాలు జరుపుతున్న సమయంలో ముందుగా కొన్ని కోడిగుడ్డు పెంకులు బయటపడ్డాయి. కానీ తరువాత చెక్కు చెదరకుండా ఉన్న కోడిగుడ్డు బయటపడటం ఆశ్చర్యానికి గురిచేసింది’’ అని ఐఏఏ ఆర్కియాలజిస్టు ఎల్లా నగోర్‌స్కై అన్నారు. 


ఈ తవ్వకాల్లో పిల్లలు ఆడుకునే కొన్ని చెక్క బొమ్మలు కూడా లభించాయి. గతంలో మారెషా అనే ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 2300 ఏళ్ల క్రితమే కోళ్ల పెంపకం ఉన్నట్టు ఆధారాలు బయటపడ్డాయి. అధికారులు ఆ కోడిగుడ్డు ఫోటోలను సోషల్‌ మీడియాలో పెట్టడంతో  ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.


Updated Date - 2021-06-12T05:30:00+05:30 IST