e motor : ఈ - మోటార్ రూపొందించిన 17 ఏళ్ల బాలుడు.. భవిష్యత్‌ ఈ-వాహన రంగంలో విప్లవమే!

ABN , First Publish Date - 2022-08-18T01:26:37+05:30 IST

కొన్ని ఆవిష్కరణలు భవిష్యత్‌లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతాయి. ఈ తరహా ఆవిష్కరణే చేశాడు అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 17 ఏళ్ల బాలుడు రాబర్ట్ సాన్‌సోన్.

e motor : ఈ - మోటార్ రూపొందించిన 17 ఏళ్ల బాలుడు.. భవిష్యత్‌ ఈ-వాహన రంగంలో విప్లవమే!

ఫ్లోరిడా : కొన్ని ఆవిష్కరణలు భవిష్యత్‌లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతాయి.  ఈ తరహా ఆవిష్కరణే  చేశాడు అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 17 ఏళ్ల బాలుడు రాబర్ట్ సాన్‌సోన్(Robert Sansone). ఎలక్ట్రిక్ మోటార్‌ను(electric motor) తానే స్వయంగా డిజైన్ చేసి తయారు చేశాడు. మరింత పర్యావరణహితం, ఆర్థిక భారం తగ్గింపు లక్ష్యంగా ఈ మోటార్‌ను రూపొందించానని రాబర్ట్ చెప్పాడు.


కాగా ప్రస్తుతం వాహనాల్లో సాధారణంగా వినియోగిస్తున్న ‘పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్స్‌’తో పోల్చితే ఎలక్ట్రిక్ మోటార్‌లో ఫ్యాన్స్, పంప్స్ మాదిరిగా ‘సింక్రోనస్ రెలక్టన్స్ మోటార్ డిజైన్’ ఉంటుంది. అయినప్పటికీ ఎలక్ట్రిక్ వాహనానికి సరిపడా టార్క్‌(చక్రాన్ని తిప్పగలిగే శక్తి)ని జనరేట్ చేయలేవు. దీనికి ఒక పరిష్కారం కనుగొన్నాడు. సాధారణంగా పర్మనెంట్ మేగ్నెట్ మోటార్లలో మోటార్‌ని నడిపించడానికి రోటర్‌తో ఎలక్ట్రోమేగ్నెటిక్ ఫీల్డ్, మేగ్నెట్స్ అనుసంధానమై ఉంటాయి. తద్వారా ఎనర్జీ జనరేట్ అవుతుంది. అయితే సింక్రోనస్ రెలక్టెన్స్ మోటార్‌లో మేగ్నెట్స్ లేకుండా చేశాడు. అయితే స్టీల్ రోటర్‌.. డిస్క్‌ల రూపంలో పలు స్లాట్స్‌ను కలిగివుంటుంది. రోటర్ తిరగడంతో స్టీల్, గాలితో నిండిన ఖాళ్లీ ప్రదేశాలు టార్క్‌ను జనరేట్ చేయడంతో దోహదపడతాయి.


కాగా ఈ -మోటార్ భవిష్యత్ వాహన రంగంలో విప్లవం తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  ఎందుకంటే వాహనాల మన్నిక ఎక్కువకాలం ఉండడమే కాకుండా వ్యయం కూడా తక్కువగా ఉండడమే దీనికి కారణంగా ఉంది.

Updated Date - 2022-08-18T01:26:37+05:30 IST