ఈ దీపావళితో Hyderabad లో పెరిగిన వాయుకాలుష్యం!

ABN , First Publish Date - 2021-11-06T16:58:21+05:30 IST

దీపావళి రోజున కాలుష్య తీవ్రత వివరాలతో పోల్చి నివేదికలో తెలిపింది..

ఈ దీపావళితో Hyderabad లో పెరిగిన వాయుకాలుష్యం!

హైదరాబాద్‌ సిటీ : సాధారణ రోజుతో పోల్చితే దీపావళి సందర్భంగా బాణాసంచాతో గాలిలో పీఎం 2.5, పీఎం 10 ధూళి కణ లు స్పల్ప మోతాదులో పెరిగాయని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)  నివేదికలో వెల్లడించింది. గాలిలో నైట్రోజన్‌, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ శాతం తగ్గిందని తెలిపింది. దీపావళి సందర్భంగా పీసీబీ అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 11వరకు ప్రత్యేకడ్రైవ్‌లను ఏర్పాటు చేసింది. సాధారణ రోజు కాలుష్య తీవ్రత ప్రామాణికంగా అక్టోబర్‌ 29న నమోదైన వివరాలను, దీపావళి రోజున కాలుష్య తీవ్రత వివరాలతో పోల్చి నివేదికలో తెలిపింది.


సాధారణ రోజుతో పోల్చితే గాలిలో పీఎం 2.5 కణాలు 30 శాతం పెరగగా, పీఎం 10 కణాలు స్పల్పంగా పెరిగాయి. సాధారణ రోజుతోపాటు, గత ఏడాది దీపావళి రోజుతో పోల్చితే గాలిలో సల్ఫర్‌డైఆక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ల పరిమాణం స్పల్పంగా తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా ధ్వనికాలుష్యం వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలతో పోల్చితే నివాస ప్రాంతాల్లో పెరిగిందని  వెల్లడించింది.

Updated Date - 2021-11-06T16:58:21+05:30 IST