నాలుగేళ్లు కాదు.. 24 ఏళ్ల వయసు.. చిన్న పిల్లాడిలా కనిపిస్తున్న ఇతడి కథేంటంటే..

ABN , First Publish Date - 2021-07-19T20:26:06+05:30 IST

ఆ ఇంట్లో ఒక వృద్ధ జంట ఉంది. ఒక పిల్లాడు తప్పటడుగులు వేస్తూ వారి వద్దకు వెళ్లాడు. ఆ వృద్ధుల ఒడిలో కూర్చున్నాడు.

నాలుగేళ్లు కాదు.. 24 ఏళ్ల వయసు.. చిన్న పిల్లాడిలా కనిపిస్తున్న ఇతడి కథేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఇంట్లో ఒక వృద్ధ జంట ఉంది. ఒక పిల్లాడు తప్పటడుగులు వేస్తూ వారి వద్దకు వెళ్లాడు. ఆ వృద్ధుల ఒడిలో కూర్చున్నాడు. ఈ దృశ్యం చూసిన వాళ్లందరూ కూడా ఆ పిల్లాడు ఆ జంట మనవడో, లేక లేటుగా పుట్టిన బిడ్డో అనుకుంటారు. కానీ నిజానికి ఆ బుడ్డోడు వయసు 24 ఏళ్లు అని తెలిసి షాకైపోతారు. ఈ దృశ్యం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో చాలా మందికి సుపరిచితమే. ఎందుకంటే ఇక్కడ నివశించే రంజాన్ అలీ అనే యువకుడి వింత వ్యాధితో బాధపడుతున్నాడు.


1997లో రంజాన్ జన్మించినప్పుడు ఆ కుటుంబం ఎంతో సంతోషించింది. అబ్బాయి పుట్టాడని ఊరంతా స్వీట్లు పంచింది. నాలుగైదేళ్లు వచ్చినా పిల్లాడిలో పెద్దగా ఎదుగుదల కనిపించలేదు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఈ అంశాన్ని గమనించలేదు. ఇప్పుడు రంజాన్ వయసు 24 ఏళ్లు. కానీ అతని ఎత్తు మాత్రం 25 అంగుళాలు మాత్రమే. నాలుగైదేళ్ల పిల్లాడిలా కనిపించే రంజాన్‌కు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. వీరిద్దరూ వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. తాను మాత్రం తల్లిదండ్రులకు భారంగా మారానని అతను బాధపడుతున్నాడు. ప్రభుత్వం తమ బిడ్డను ఆదుకోవాలని, కనీసం ఇల్లు, ఆహారం అందేలా చూడాలని రంజాన్ తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2021-07-19T20:26:06+05:30 IST