Abn logo
Jun 18 2021 @ 04:38AM

ఈ పిల్లాడి పేరు ‘హెచ్‌టీఎంఎల్‌’

న్యూఢిల్లీ, జూన్‌ 17: పిల్లలకు పేర్లు పెట్టే సమయంలో తల్లిదండ్రులు బాగా ఆలోచిస్తారు. చాలా మంది తల్లిదండ్రులు దేవుళ్ల లేదా తమ కుటుంబ సభ్యుల పేర్లు కలిసొచ్చేలా  పేర్లు పెట్టుకుంటారు. అయితే, ఫిలిప్పీన్స్‌లో తాజాగా ఓ వ్యక్తి తన కుమారుడికి వెబ్‌ అడ్ర్‌సకు సంబంధించిన పేరు పెట్టుకున్నాడు. తన పిల్లాడికి హెచ్‌టీఎంఎల్‌ (హైపర్‌టెక్ట్స్‌ మార్కప్‌ లాంగ్వేజ్‌) అనే పేరు పెట్టాడు. చిత్రం ఏంటంటే ఈ ‘హెచ్‌టీఎంఎల్‌’ తండ్రి పేరు ‘మ్యాక్‌’. వెబ్‌డిజైనర్‌గా పనిచేస్తున్నాడు.