కండలేరును సందర్శించిన తిరుపతి కలెక్టరు

ABN , First Publish Date - 2022-05-22T05:08:29+05:30 IST

తిరుపతి జిల్లా కలెక్టరు వెంక ట్రామిరెడ్డి శనివారం కండలేరు జలాశయాన్ని సందర్శించారు. అక్కడి అతిథి గృహంలో డ్యాం ఇంజ నీర్లతో సమీక్షించారు.

కండలేరును సందర్శించిన తిరుపతి కలెక్టరు
కండలేరు హెడ్‌రెగ్యులేటర్‌ను పరిశీలిస్తున్న కలెక్టరు

రాపూరు, మే 21: తిరుపతి జిల్లా కలెక్టరు వెంక ట్రామిరెడ్డి శనివారం కండలేరు జలాశయాన్ని  సందర్శించారు. అక్కడి  అతిథి గృహంలో డ్యాం ఇంజ నీర్లతో సమీక్షించారు.  అనంతరం హెడ్‌రెగ్యులేటర్‌ వద్దకు చేరుకుని నీటి విడుదల, నియంత్రణను పరిశీలి ంచారు.   కండలేరు డ్యాం నుంచి పలుమార్లు నీటిని విడుదల చేసి తిరుపతి, తిరుమల దాహార్తి తీర్చినట్లు, తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి పట్టణాలకు కండలేరు తాగునీటిని  అందిస్తున్నట్టు అధికారులు వివరించారు. అనంతరం సత్యసా యిగంగ కాలువ,  పికప్‌ఏరు బ్యాలెన్సింగ్‌ రిజర్వా యర్‌ను పరిశీలించారు. ఇటీవల తిరుపతిలో తొలి సాగునీటి సలహా బోర్డు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో పలు కీలకనిర్ణయాలు తీసుకున్న కలెక్టరు సాగునీటిని అందించే సత్యసాయిగంగ కాలువ, కండలేరు డ్యాంను పరిశీలించారు. డ్యాంలో 40.721టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అవుట్‌ఫ్లో 1760 క్యూసెక్కులుగా ఉన్నట్లు  అధికారులు ఆయనకు వివరించారు. తిరుపతి జిల్లాకు ఇవ్వాల్సిన వాటాపై ఆరా తీశారు. రాపూరు ఎంపీపీ చెన్ను బాలకృష్ణారెడ్డి, వైసీపీ సీనియర్‌ నాయకులు శ్రీకిరెడ్డి శశిధర్‌రెడ్డి డ్యాంలో కలెక్టరును కలుసుకుని శాలువాలతో సన్మానించారు. కలెక్టర్‌ వెంట ఎస్‌ఈ రాంగోపాల్‌, ఈఈలు విజయ్‌కుమార్‌రెడ్డి, రాధాకృష్ణమూర్తి,  ఏఈఈ తిరు మలయ్య  ఉన్నారు. 

Updated Date - 2022-05-22T05:08:29+05:30 IST