రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

ABN , First Publish Date - 2022-01-26T05:30:00+05:30 IST

జిల్లావ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవాన్ని ప్రజలు బుధవారం నిరాడంబరంగా జరుపుకున్నారు.

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
జాతీయజెండా ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 26 : జిల్లావ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవాన్ని ప్రజలు బుధవారం నిరాడంబరంగా జరుపుకున్నారు. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ ముషా రఫ్‌ ఫారూఖీ ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే, ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, పౌరసంబంధాల శాఖ అధికారి ఉమారాణి పాల్గొన్నారు. కలెక్టర్‌, ఎస్పీ పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో వైద్య సిబ్బంది థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసిలోనికి పంపించారు.

ప్రతీ ఒక్కరూ కొవిడ్‌ టీకాలు తీసుకోవాలి : కలెక్టర్‌

జిల్లా ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌టీకా రెండు డోసులను తీసుకోవాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ పిలుపునిచ్చారు. రెండు డోసులను తీసుకున్నవారు. బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలన్నారు. మూడోవేవ్‌ ఎదుర్కోవాలంటే ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. మాస్కులు ధరించడం మరువరాదని, బహిరంగ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన అవ సరం ఉందని అన్నారు. కొవిడ్‌ టీకా కార్యక్రమం కొనసాగుతున్నందున టీకా తీసుకోనివారిని టీకా తీసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. 

డీఈవో కార్యాలయంలో.. జిల్లావిద్యాశాఖ అధికారి కార్యాలయంలో బుధవారం డీఈవో రవీందర్‌రెడ్డి పతాకావిష్కరణ చేశారు. సెక్టోరియల్‌ అధికారి సలోమి కరుణ, పరీక్షల ఇన్‌చార్జి పద్మ, సూపరెండెంట్‌ భోజన్న, నారాయణ, తదితర సిబ్బంది హాజరయ్యారు.

మాజీ ఎమ్మెల్యే నివాసంలో.. మాజీ ఎమ్మెల్యే ఏలేటిమహేశ్వర్‌రెడ్డి నివాసంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణ ఇన్‌చార్జి నాందేడపు చిన్ను, మైనా రిటీ జనరల్‌ సెక్రటరీ మొహ్మద్‌ అజార్‌, నారాయణరెడ్డి, జింక సూరి, రాజేష్‌, సాయి, తదితర నాయకులు పాల్గొన్నారు. 

సీపీఐ కార్యాలయంలో.. స్థానిక ఇందిరానగర్‌ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని నాయకులు నిర్వహించారు. నాయకులు విలాస్‌, ఎస్‌ఎన్‌ రెడ్డి, జాదవ్‌ శంకర్‌, అనంత్‌రావు, పుండలిక్‌ పాల్గొన్నారు. 

పోలీస్‌ కార్యాలయంలో.. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ పతాకావిష్కరణ చేశారు. అడిషనల్‌ ఎస్పీ రామ్‌రెడ్డి,  ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు ఉపేందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంఐఎం కార్యాలయంలో..  పార్టీ అధ్యక్షుడు అజీమ్‌బిన్‌ యాహియా గణ తంత్ర దినోత్సవము సందర్భంగా బుధవారం పతాకావిష్కరణ చేశారు. కౌన్సిలర్‌ సయ్యద్‌అబ్రార్‌, ముజాహిద్‌, మజహర్‌, రఫీక్‌ అహ్మద్‌ ఖురేషి, ఉస్మాన్‌, జబ్బార్‌, తయ్యబ్‌ బిన్‌ పాల్గొన్నారు.  ఏక్తా సోషల్‌ వెల్ఫేర్‌ సంస్థ గణతంత్ర దినోత్సవము నిర్వహించింది. షైక్‌ ముజాహిద్‌, అల్మాస్‌, సోఫీ, సాజిద్‌ పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో.. ట్యాంక్‌బండ్‌ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద గణతంత్ర వేడుకలు జరిపారు. అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, కళ్యాణ్‌రాఘవ్‌, శ్రీనివాస్‌, భూమన్న, మెరుగు రాజన్న పాల్గొన్నారు. 

మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ మున్సిపల్‌ కార్యాలయం, ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేసిన 150 అడుగుల ఎత్తుగల జాతీయ జెండాను ఆవిష్కరించారు. కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, వైస్‌ చైర్మన్‌ సాజిద్‌, కౌన్సిలర్లు, నాయకులు వేడుకలకు హాజరయ్యారు.

బీజేపీ కార్యాలయంలో..  పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి జెండా ఆవిష్కరించారు. ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు, రావుల రాంనాథ్‌, అయ్యన్నగారి భూమయ్య, సాధం అరవింద్‌, శ్రావణ్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో..

అధ్యక్షుడు కిషన్‌ పతాకావిష్కరణ చేశారు. ప్రధాన కార్యదర్శి జీఎస్‌ నారా యణ  ఎం. సుదర్శన్‌రావు, టి. సుదర్శన్‌, మధుసూదన్‌, పి. భూమన్న, తదితర పెన్షనర్లు పాల్గొన్నారు.  

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చౌరస్తాలో 73వ గణతంత్ర దినోత్సవము సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. మొహమ్మద్‌ ఉస్మాన్‌  పాల్గొన్నారు. 

బాలరక్ష భవన్‌లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. సభ్యులు స్వదేశ్‌, అనిల్‌, దేవి మురళి, సగ్గం రాజు, ఓస శ్రీనివాస్‌, శైలజ పాల్గొన్నారు. 

సోన్‌ : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఆరిఫా సుల్తానా, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎంపీడీవో సాయిరాం, పోలీస్‌స్టేషన్‌లో సీఐ రామ్‌నర్సింహరెడ్డిలు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. 

దిలావర్‌పూర్‌ : మండలంలోని గ్రామాల్లో బుధవారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో మోహన్‌, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ హిమబిందు, పీఏసీఎస్‌ లో సీఈవో సుకు మార్‌, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం గరుచరణ్‌, గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వ, పశువుల ఆసుపత్రిలో డా.నంద కుమార్‌, ఆయా గ్రామాల్లోని జాతి నాయకుల విగ్రహల వద్ద యువజన సంఘా ల నాయకులు త్రివర ్ణ పతాకాన్ని ఎగురవేశారు. దిలావర్‌పూర్‌లో జరిగిన గణ తంత్ర వేడుకల్లో ఎంపీపీ బాపురావు, పీఏసీఎస్‌ చైర్మన్‌  పీవీ రమణారెడ్డి, ఎంపీటీసీలు పాల్దె అక్షర అనిల్‌, దొడ్డికింది గంగవ్వ, ముత్యంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

దస్తూరాబాద్‌ : మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ శివకుమార్‌  జెండాను ఎగురవేశారు. మండల పరిషత్‌ కార్యాలయం లో ఎంపీపీ సింగరి కిషన్‌జెండాను ఎగుర వేశారు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై జ్యోతిమణి, గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్‌ నిమ్మతోట రాజమణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రైతువేదిక వద్ద వ్యవసాయ విస్తరణ అధికారి తిరుపతి జెండాను ఎగురవేశారు. 

ఖానాపూర్‌  : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ లక్ష్మీ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వనజ, పోలీస్‌స్టేషన్‌లో సీఐ అజయ్‌బాబు, మున్సిపల్‌ కార్యాలయంలో ఇన్‌చార్జీ కమిషనర్‌ సంతోష్‌, వ్యవసాయమార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్‌ పుప్పాల శంకర్‌, పీఏసీఎస్‌ కార్యాలయంలో ఇప్ప సత్యనారాయణరెడ్డి, అటవీశాఖ డివిజన్‌ కార్యాలయంలో ఎఫ్‌డీవో కోటేశ్వర్‌రావు  పతాకాన్ని ఆవిష్కరించారు.

Updated Date - 2022-01-26T05:30:00+05:30 IST