ఘజియాబాద్ గోశాలలో అగ్నిప్రమాదం...38 ఆవుల మృతి

ABN , First Publish Date - 2022-04-12T14:15:24+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గోశాలలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 38 ఆవులు కాలిపోయాయి...

ఘజియాబాద్ గోశాలలో అగ్నిప్రమాదం...38 ఆవుల మృతి

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గోశాలలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 38 ఆవులు కాలిపోయాయి.ఘజియాబాద్ డంప్ యార్డ్‌లో చెలరేగిన మంటలు ఇందిరాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కనవాని గ్రామంలోని గోశాలకు వ్యాపించాయి.ఈ మంటల్లో గోశాలలోని 38 ఆవులు మరణించాయని శ్రీకృష్ణ గోశాల నిర్వాహకుడు సూరజ్ పండిట్ చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగినపుడు గోశాలలో 150 ఆవులున్నాయి.ఘజియాబాద్ పోలీసు చీఫ్ మునిరాజ్ మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దింపారు.జిల్లా మేజిస్ట్రేట్ రాకేష్ కుమార్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు సింగ్ తెలిపారు. 


అగ్నిప్రమాదంపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీలో సర్కిల్ ఆఫీసర్ అభయ్ కుమార్ మిశ్రా ఉన్నారు.గోశాలకు సమీపంలోనే డంపింగ్ యార్డు ఉందని, ఎండ వేడిమి వల్ల మధ్యాహ్నం మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డంపింగ్ యార్డు సమీపంలో డంపింగ్ యార్డు వదలడం వల్ల ఆవులకు హాని కలిగే ప్రమాదం ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు గతంలో లేఖలు రాసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గోశాల నిర్వాహకులు చెప్పారు.


Updated Date - 2022-04-12T14:15:24+05:30 IST