Viral Videoఒ: బాబోయ్.. అది పాము అనుకున్నావా.. చిన్నపిల్లాడు అనుకున్నావా!

ABN , First Publish Date - 2022-05-16T01:59:13+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ జరిగింది. నె

Viral Videoఒ: బాబోయ్.. అది పాము అనుకున్నావా.. చిన్నపిల్లాడు అనుకున్నావా!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ జరిగింది. నెటిజన్లు అంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అనే వివరాల్లోకి వెళితే..


దాహంగా ఉన్న నల్లటి త్రాచు పాముకు ఓ వ్యక్తి నీటిని అందించాడు. వ్యక్తి నీళ్ల గ్లాసును చేతిలో పట్టుకుని ఉండగా.. అటువైపు వచ్చిన పాము.. దప్పిక తీర్చుకుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తే ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. నీళ్లు అందించడం మంచి విషయమే కానీ.. చేతిలో గ్లాసు పట్టుకుని చిన్నపిల్లల దాహం తీర్చినట్టు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అది కాటేస్తే పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. 




Updated Date - 2022-05-16T01:59:13+05:30 IST