Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 30 2021 @ 11:56AM

కరోనా థర్డ్ వేవ్ గురించి తేల్చిచెప్పిన ఐసీఎంఆర్!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ గురించి గత కొంతకాలంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కరోనా థర్డ్ వేవ్ రావచ్చనే అంచనాలు వేశారు. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కరోనా థర్డ్ వేవ్ గురించి మరో కొత్త విషయాన్ని తెలిపింది. సెకెండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్ అంత తీవ్రంగా ఉండదని ఐసీఎంఆర్ నిపుణులు చెబుతున్నారు. 

ఐసీఎంఆర్‌కి చెందిన డాక్టర్ సమిరన్ పాండా మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేరన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోగల జిల్లాల వారీగా కరోనా పరిస్థితుల డేటాను పరిశీలించి శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారన్నారు. అయితే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం ఏర్పడుతుందన్నారు. కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తరువాత కేసులు పెరుగుతూ వచ్చాయన్నారు.

Advertisement
Advertisement