థర్డ్ వేవ్‌లో పిల్లల భద్రతపై డాక్టర్లు ఏమంటున్నారు?

ABN , First Publish Date - 2021-06-15T00:09:48+05:30 IST

థర్డ్ వేవ్ గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్న పిల్లలకు ప్రమాదకరమన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ చూసిన వారికి థర్డ్ వేవ్‌పై

థర్డ్ వేవ్‌లో పిల్లల భద్రతపై డాక్టర్లు ఏమంటున్నారు?

హైదరాబాద్: థర్డ్ వేవ్ గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్న పిల్లలకు ప్రమాదకరమన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ చూసిన వారికి థర్డ్ వేవ్‌పై భయం నెలకొంది. చిన్నపిల్లలను రక్షించుకోవడంపై ... కోవిడ్ భూతానికి వాళ్లను దూరంగా ఉంచడంపై తదితర ఆలోచనల్లో మునిగిపోతున్నారు. అయితే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిర్వహించిన ‘పిల్లలు భద్రం’ కార్యక్రమంలో వైద్య నిపుణులు ముఖ్య సూచనలు చేశారు. 


డాక్టర్ మహిష్మ కొడిదెల మాట్లాడుతూ... ‘‘ ముందుగా 18-45 వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వగలితే.. ఈ ప్రమాదం నుంచి పిల్లలు బయటపడే అవకాశం ఉంటుంది. ఈ క్లిష్టపరిస్థితుల్లో వ్యాక్సినేషన్ అనేది అత్యవసరం. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువగా ఉండే టీచర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలి. పిల్లలకు అతి దగ్గరకు ఉండేవారు వారే కదా. గర్భిణీలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ముందు నుంచి డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతూ.. బెడ్ కొరత లేకుండా చూసుకోవాలి. థర్డ్ వేవ్ గురించి తల్లిదండ్రులు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. తక్కువ లక్షణాలతోనే పిల్లలు బయటపడుతున్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పని సరి పరిస్థితుల్లో తప్ప బయటివారిని ఇంటికి ఆహ్వానించకపోవడమే బెటర్. 10-12 ఏళ్ల పిల్లలను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లకు అర్థమయ్యేలా కోవిడ్ గురించి చెప్పాలి. అలాగే చిన్నారులకు సాధారణంగా ఇచ్చే వ్యాక్సిన్లు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అన్నారు. 



Updated Date - 2021-06-15T00:09:48+05:30 IST