కొన్ని కాంబినేషన్స్‌కు ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. అవి రిపీట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అలాంటి ఓ సూపర్ కాంబో విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్. ( Vijay Devakonda - Puri jagannath). ఈ ఇద్దరి తొలి కలయికలోని సినిమా ‘లైగర్’ (Ligr). బాక్సింగ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం ‘మైక్ టైసన్’ (Myke Tyson) నటిస్తుండడంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు నెలకొన్నాయి. విజయ్, మైక్ టైసన్ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నట్టు సమాచారం. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా, పూరీ స్టైలాఫ్ కేరక్టరైజేషన్, పూరీ తరహాలోని ఎమోషన్స్ ఈసినిమాకి హైలైట్స్ గా నిలవబోతున్నాయి. ఇదివరకు విడుదలైన ‘లైగర్’ చిత్రం టీజర్ కు మంచి స్పందన దక్కింది.
ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే.. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ‘జనగణమన’ (JGM) చిత్రం అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో విజయ్ సోల్జర్ గా నటిస్తున్నట్టు ఇదివరకే వార్తలొచ్చాయి. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో పూజా హెగ్డే (Puja Hegde) కథానాయికగా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, శ్రీకార స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో సినిమా తెరకెక్కనుంది. ‘లైగర్’ సినిమా విడుదలైన తర్వాత ‘జనగణమన’ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని సమాచారం. ఇక అసలు విషయానికొస్తే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడో సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారట. ఈ సినిమా కథను పూరీ ఆల్రెడీ సిద్దం చేసేశాడట.
‘జనగణమన’ చిత్రం చివరిదశలో ఉండగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళతారట. అలాగే.. దీని తర్వాత పూరీ.. విజయ్ తో మరో సినిమాను కూడా ప్రకటిస్తాడట. ఇలా ఒకే హీరోతో వరుస సినిమాలు చేసే ఆచారాన్ని తమిళ దర్శకుడు శివ (Shiva), హెచ్. వినోద్ (H.Vinod) ల నుంచి పూరీ ఇన్స్ పైర్ అయ్యాడనిపిస్తోంది. ఏదైమైనా సినిమా వెంటనే సినిమాలు చేయడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. మరి మూడో సినిమా ఎప్పుడు మొదలు కాబోతోందో చూడాలి.