Oct 28 2021 @ 12:46PM

'Pushpa' the rise : ఆకట్టుకుంటోన్న ‘సామి.. సామి’ లిరికల్ సాంగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప : ది రైజ్’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. కథానాయిక శ్రీవల్లిగా రష్మికా మందణ్ణ తన గ్లామర్ తో ఆకట్టుకోనుంది. ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేశారు మేకర్స్. ఇది వరకు విడుదలైన ‘పుష్ప’ టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ రాగా.. ఆ తర్వాత విడుదలైన ‘దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి’ లిరికల్ సాంగ్స్ కూడా అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక లేటెస్ట్ గా ‘పుష్ప’ సినిమాలోని మూడో సింగిల్ ను కూడా విడుదల చేశారు. ‘సామీ సామీ’ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



చంద్రబోస్ రాసిన ఈ పాటలో పుష్ప, శ్రీవల్లి పాత్రల మధ్య ప్రణయాన్ని అద్బుతంగా ఆవిష్కరించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట అభిమానుల్ని భలేగా అలరిస్తోంది.  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సైతం సామి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. మిగతా భాషల్లో కూడా ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎర్ర చందన స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.