తిరంగ సంబురం

ABN , First Publish Date - 2022-08-12T05:20:06+05:30 IST

75ఏళ్ల స్వతంత్ర స్ఫూ ర్తితో నిర్వహిస్తున్న వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలో ఊరువాడలా తిరంగ సం బురం కనిపిస్తోంది.

తిరంగ సంబురం
జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌ 2కే రన్‌ నిర్వహిస్తున్న దృశ్యం


జిల్లాలో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవాలు

ఈ నెల 21 వరకు కార్యక్రమాలు

2కే  ఫ్రీడమ్‌ రన్‌   విజయవంతం

కలెక్టర్‌ పిలుపుతో కదిలిన అధికార యంత్రాంగం

నేడు స్వతంత్ర రక్షాబంధన్‌

ఆదిలాబాద్‌, ఆగస్టు11:(ఆంధ్రజ్యోతి) : 75ఏళ్ల స్వతంత్ర స్ఫూ ర్తితో నిర్వహిస్తున్న వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలో ఊరువాడలా తిరంగ సం బురం కనిపిస్తోంది. ఎటు చూసినా మువ్వన్నెల జెండాల రెపరెపలాడుతున్నాయి. వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునివ్వడంతో జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 21 వరకు దేశ సమైక్యతను చాటే విధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇం దులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా గురువారం 2కే ఫ్రీడమ్‌రన్‌ ను నిర్వహించారు. అన్ని మండల కేంద్రాల్లో పోలీసుల ఆధ్వర్యం లో నిర్వహించిన 2కే రన్‌ విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రారంభమై కలెక్టర్‌చౌక్‌, తెలంగాణచౌక్‌, కాన్వెంట్‌ స్కూల్‌, సరస్వతి శిశు మందిర్‌, డీఆర్డీఏ కార్యాలయం మీదుగా ఫ్రీడమ్‌రన్‌ చేపట్టారు. ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధికారులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

దేశభక్తిని చాటేలా..

స్వతంత్ర భారత వజోత్సవాల సందర్భంగా దేశభక్తిని చాటేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్రామ గ్రామనా మొక్కలు నాటడం, ఫ్రీడమ్‌పార్కుల ఏర్పాటు, ఫ్రీడమ్‌ 2కే రన్‌లను నిర్వహించిన అధికారులు ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 12న జాతీయ సమైక్యత రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 13న విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాల ప్రజల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలను చేపట్టనున్నారు. 14న జానపద కళాకారుల ప్రదర్శనలు, 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 16న రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలపన, 17న జిల్లా కేంద్రాల్లో మెగా రక్తదాన శిబిరాల ఏర్పాటు, 18న ఫ్రీడమ్‌కప్‌ పేరుతో క్రీడల నిర్వహణ, 19న ప్రభుత్వ ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు, జైళ్లలో ఖైదీలకు పండ్లు, స్వీట్ల పంపిణీ, 20న దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటే విధంగా ముగ్గుల పోటీలు, 21న అసెంబ్లీ, ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు, 22న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంతో వజ్రోత్సవాలు ముగియనున్నాయి.

హార్‌ ఘర్‌మే తిరంగ..

స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఇంటిపై మూడు రంగుల జెండాను ఎగుర వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే గ్రా మాల్లో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మున్సిపాలిటీలు ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాయి. దీంతో ఎవరికి వారే తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగుర వేసుకుంటున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజకీయ పార్టీల నేతలు కూడా వజ్రోత్సవాల సం దర్భంగా ర్యాలీలు, పాదయాత్రలు చేపడుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంటింటికీ జాతీయజెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా బీజేపీ జా తీయ జెండాలతో భారీ ర్యాలీని నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఆజాదిక గౌరవయాత్రను చేపట్టింది. జాతీయ జెండాలను అన్ని బుక్స్‌స్టాల్‌, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంచారు. వజ్రోత్సవాల్లో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ పిలుపునివ్వడంతో అన్ని శాఖల అధికారుల్లో కదలిక కనిపిస్తోంది. ఈ సారి పంద్రాగస్టును ఘనంగా జరుపుకునేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. 


వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి..

- సిక్తాపట్నాయక్‌, కలెక్టర్‌

స్వతంత్ర భారత వ జ్రోత్సవాల్లో జిల్లా ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలి. ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తూ స్వతంత్ర పోరాట స్ఫూర్తితో మేలుకొలిపే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇదే స్ఫూర్తితో ఈ నెల 22 వరకు నిర్వహించే వజ్రోత్సవ కార్యక్రమాల్లో పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, యువత భాగస్వాములు కావాలి. 


Updated Date - 2022-08-12T05:20:06+05:30 IST