మువ్వన్నెల రెపరెపలు

ABN , First Publish Date - 2022-08-07T05:09:51+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శనివారం ఉదయం కలెక్టరేట్‌ వద్ద నుంచి కంకరగుంట ఆర్‌వోబీ మీదుగా బృందావన్‌ గార్డెన్స్‌ ఎన్‌టీఆర్‌ స్టేడియం వరకు భారీ తిరంగా ర్యాలీని నిర్వహించారు.

మువ్వన్నెల రెపరెపలు
ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి

నగర వీధులు త్రివర్ణమయం

750 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ

వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు

గుంటూరు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శనివారం ఉదయం కలెక్టరేట్‌ వద్ద నుంచి కంకరగుంట ఆర్‌వోబీ మీదుగా బృందావన్‌ గార్డెన్స్‌ ఎన్‌టీఆర్‌ స్టేడియం వరకు భారీ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ ప్రారంభించిన అనంతరం కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది త్యాగమూర్తుల ప్రతిఫలంగా ఏర్పడిన స్వతంత్ర భారతదేశం 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వారి స్ఫూర్తిని ప్రజల్లో కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ప్రత్యేకంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతీ ఇంటికి జెండా, కర్రపుల్ల అందజేసి వారి ఇళ్లపై జెండాలు ఎగురవేసేలా చేస్తామని చెప్పారు. జడ్పీ చైౖర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా మాట్లాడూతతూ దేశభక్తిని చాటిచెప్పేలా 750 మీటర్ల త్రివర్ణ పతాక ర్యాలీని గుంటూరులో నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఈ ఉత్సవాలు తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ భారతదేశం అంటేనే ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులు కలయికన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ దేశంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది ఎంతోమందది త్యాగాల ఫలితమన్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొనడం సంతోషమన్నారు. భారతీ సోప్‌వర్క్స్‌ అధినేత అరుణాచలం మాణిక్యవేల్‌ని కలెక్టర్‌ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ గణియా రాజకుమారి, నగరపాలకసంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరి, డీఆర్‌వో చంద్రశేఖర్‌రావు, ఆర్‌డీవో ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి, డీపీవో కేశవరెడ్డి, డీఈవో శైలజ, తహసీల్దార్‌ సాంబశివరావు, నగరపాలకసంస్థ అదనపు కమిషనర్‌ శ్రీనివాస్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ చంద్రగిరి ఏసుతర్నం పాల్గొన్నారు. ర్యాలీలో వేలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కార్మికులు చేయి చేయి కలిపి ముందుకు సాగారు. 


Updated Date - 2022-08-07T05:09:51+05:30 IST