అణగారిన వర్గాల గురించి ఆలోచించండి : ప్రైవేట్ రంగానికి గడ్కరీ పిలుపు

ABN , First Publish Date - 2020-08-08T22:11:21+05:30 IST

అభివృద్ధి గురించి మాట్లాడేటపుడు అణగారిన వర్గాల గురించి ఆలోచించాలని

అణగారిన వర్గాల గురించి ఆలోచించండి : ప్రైవేట్ రంగానికి గడ్కరీ పిలుపు

న్యూఢిల్లీ : అభివృద్ధి గురించి మాట్లాడేటపుడు అణగారిన వర్గాల గురించి ఆలోచించాలని ప్రైవేటు రంగానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన ‘‘ఇండియా ఎట్75 సమ్మిట్ : మిషన్ 2020’’లో గడ్కరీ మాట్లాడారు. 


వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్ళను వివరించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి సృష్టి ప్రభుత్వానికి పెద్ద సవాళ్లని తెలిపారు. సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) రంగం దేశవ్యాప్తంగా సుమారు 11 కోట్ల ఉద్యోగాలను సృష్టించిందన్నారు. అయినప్పటికీ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. 


ప్రజలను పెద్ద నగరాల నుంచి కొత్తగా ఏర్పాటయ్యే స్మార్ట్ సిటీలకు, స్మార్ట్ విలేజ్‌లకు వెళ్లేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఈ విధంగా ప్రజలు మారడం కోసం స్మార్ట్ సిటీలు, స్మార్ట్ విలేజ్‌లలో జీవనోపాధి అవకాశాలు సృష్టించాలన్నారు. చేపల పరిశ్రమ వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని,  తక్షణమే రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్లకు పెరిగే సామర్థ్యం ఉందని చెప్పారు. 


Updated Date - 2020-08-08T22:11:21+05:30 IST