పార్టీవేళ పాటించాల్సినవి!

ABN , First Publish Date - 2020-12-31T05:47:09+05:30 IST

కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్న ఈ సమయంలో కొత్త సంవత్సరం వేడుకలను సాధ్యమైనంత

పార్టీవేళ పాటించాల్సినవి!

కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్న ఈ సమయంలో కొత్త సంవత్సరం వేడుకలను సాధ్యమైనంత వరకు ఇంట్లోనే జరుపకొనేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. బంధువులు, స్నేహితులతో కలిసి నయా జోష్‌ను ఆస్వాదించాలనుకునే వారు  పార్టీమూడ్‌లో పడి కరోనా జాగ్రత్తలను మరచిపోవద్దు. పార్టీ వేళ గుర్తుంచుకోవాల్సిన విషయాలేమిటంటే... 


మాస్క్‌ ఉండాల్సిందే:

కొంతమందితో అయినా సరే ఒక చోట పార్టీ చేసుకోవడం కరోన సమయంలో కొంత రిస్క్‌తో కూడుకున్నదే. మాస్క్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలి. మాస్క్‌ పెట్టుకున్నాం కదా! అని ద గ్గర దగ్గరగా కూర్చోవద్దు. గాలి తగిలే చోట, దూరం దూరంగా ఉండి పార్టీ చేసుకుంటే మంచిది.


హ్యాండ్‌ శానిటైజర్‌:

సబ్బు, నీళ్లు, పేపర్‌ టవల్‌, టిష్యూ పేపర్‌, డిస్‌ఇన్‌ఫెక్టంట్‌ వైప్స్‌, పెడల్‌ చెత్త డబ్బాలను ఇంటిలో ఒక్కో చోట ఏర్పాటు చేయాలి. దాంతో వ్యక్తిగత రక్షణతో పాటు ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది. 


పెద్ద శబ్దాలు వద్దు:


పెద్దగా సౌండ్‌ పెట్టి పాటలు వింటున్నప్పుడు ఒకరి మాట ఒకరికి వినిపించదు. దాంతో పెద్దగా అరచుకుంటారు. దాంతో తుంపర్లు మీద పడి వాటి ద్వారా వైరస్‌ సోకే అవకాశం ఉంది. అందుకే చిన్నగా సౌండ్‌ పెట్టి పాటలు వింటూ పార్టీని ఆస్వాదించాలి.


డ్రింక్స్‌ షేర్‌ చేసుకోవద్దు:

డ్రింక్స్‌ కోసం అందరూ ఒక చోట చేరవద్దు. పార్టీలో ఒకసారి మాత్రమే వాడడానికి వీలుండే గ్లాసులు, ప్లేట్లు ఉపయోగించాలి. ప్రతి ఒక్కరికి ఫుడ్‌ ఐటెమ్స్‌ విడిగా ఉంచితే పార్టీని ఏ భయం లేకుండా ఎంజాయ్‌ చేస్తారు.


వర్చ్యువల్‌ పార్టీ:

స్నేహితులను కలవడానికి వీలు పడని వారు వర్చ్యువల్‌ పార్టీ జరుపుకోవాలి. దాంతో దూరంగా ఉంటూనే సంతోషాలను పంచుకోవచ్చు. 


Updated Date - 2020-12-31T05:47:09+05:30 IST