Advertisement
Advertisement
Abn logo
Advertisement

పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చాకే పనులు


   బ్యాంకు ప్రతినిధులకు తేల్చి చెప్పిన విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ రైతులు 

నక్కపల్లి, అక్టోబరు 25 : విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం  మండలంలోని పలు గ్రామాల్లో భూములిచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చిన తరువాతే పనులు ప్రారంభించాలని ఈ ప్రాంత రైతులు స్పష్టం చేశారు. ఏషియన్‌ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధులు అమలాపురం, మూలపర్ర, పాటిమీద గ్రామాల రైతులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులకు పూర్తి స్థాయి లో ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ఎటువంటి ప్యాకేజీ ఇవ్వాలనే అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని సదరు బ్యాంకు ప్రతినిధి డాక్టర్‌ ప్రపుల్‌ తెలిపారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజలకు, రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని అమలాపురం సర్పంచ్‌ పి. శంకరరావు, ఉప సర్పంచ్‌ గంటా నర్సిం గరావు, వైసీపీ నాయకుడు సూరకాసుల గోవింద్‌ డిమాండ్‌ చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం జిరాయితీ భూములకు సమానంగా డి.పట్టా భూములు, సాగుభూముల రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. అంతవరకూ ఈ భూముల్లో ఎటువంటి పనులు చేయకూడదన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.  స్థానికులు బాబ్జీ, నూకరాజు, గోవింద్‌, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement