NRI లూ.. భారత్‌లో ఆస్తిపాస్తుల్ని కొనాలనుకుంటున్నారా..? అయితే వీటిని తప్పక తెలుసుకోండి..!

ABN , First Publish Date - 2021-09-29T04:44:16+05:30 IST

భారత్‌లో ఎన్నారైల పెట్టుబడులను నియంత్రించేది ఎఫ్ఈఎమ్ఏ(ఫీమా) చట్టం. దీని ప్రకారం..భారత్ వెలుపల నివసించే భారతీయ పౌరులందరూ దేశంలో వ్యవసాయ భూములు మినహా..ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే..ఇటువంటి ఆస్తులపై చెల్లించాల్సిన పన్ను మాత్రం ఆస్తి వినియోగిస్తున్న తీరుపై ఆధారపడి...

NRI లూ.. భారత్‌లో ఆస్తిపాస్తుల్ని కొనాలనుకుంటున్నారా..? అయితే వీటిని తప్పక తెలుసుకోండి..!

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఎన్నారైల పెట్టుబడులను నియంత్రించేది ఎఫ్ఈఎమ్ఏ(ఫీమా) చట్టం. దీని ప్రకారం..భారత్ వెలుపల నివసించే భారతీయ పౌరులందరూ దేశంలో వ్యవసాయ భూములు మినహా..ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే..ఇటువంటి ఆస్తులపై చెల్లించాల్సిన పన్ను మాత్రం ఆస్తి వినియోగిస్తున్న తీరుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి.. భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న ఎన్నారైలు ఫీమా నిబంధనలపై క్షుణ్ణమైన అవగాహన కలిగి ఉండాలి. రియల్ పెట్టుబడులకు సంబందించి ఎఫ్ఈఎమ్ఏ చట్టం ఏం చెబుతోందంటే..


1. ఎన్నారైలు భారత్‌లో ఎన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులనైనా కొనుగొలు చేయచ్చు. ఈ కొనుగోళ్లపై సంఖ్యాపరమైన పరిమితులేవీ లేవు. ఇలా కొన్న వాటిని సొంతానికి వినియోగిస్తున్నారా..? లేక అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని పొంద దలుచుకున్నారా..? లేక పెట్టుబడిగా భావిస్తున్నారా అనే అంశాలపై పన్ను చెల్లింపులు ఆధారపడి ఉంటాయి. 


2. స్వీయ వినియోగానికి కొనుక్కున్న రియల్ ఆస్తిపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్నారై విదేశాల్లో నివసిస్తున్న కారణంగా వినియోగంలో లేనిదానికీ ఈ నిబంధన వర్తిస్తుంది. 


3. అయితే..సొంతంగా వినియోగించేందుకు ఒకటి కంటె ఎక్కువ రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్టైతే.. ఏదో ఒక ఇంటిని మాత్రమే స్వీయవినియోగానికి కేటాయించినట్టు పరగణిస్తారు. తతిమా ఆస్తులను అద్దెకు ఇచ్చినట్టుగా పరిగణిస్తూ నామమాత్రపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 


4. ఎన్నారైలు తమ రియల్ ఆస్తులను అద్దెకు ఇస్తే..పన్ను పరిధిలోకి వస్తారు. అద్దె రూపంలో వచ్చే వార్షిక ఆదాయంపై కచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ప్రాపర్టీ రిపేర్లు, నిర్వహణ ఖర్చులను స్టాండర్డ్ డిడక్షన్స్ కింద మినహాయించుకోవచ్చు.  ఇంటిపై లోను వగైరాలు ఉంటే రూ.రెండు లక్షల వరకూ డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. 


5.ఇక పెట్టుబడిగా ఆస్తిని కొనుగోలు చేస్తే..అది చేతులు మారినప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ కింద ఈ మొత్తం చెల్లించాలి. ఇది రెండు రకాలు. ఆస్తి కొన్న రెండు సంవత్సరాలలోపే విక్రయిస్తే షార్ట్ టర్మ్ గెయిన్స్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. రెండు సంవత్సరాల తరువాత అమ్మకానికి పెడితే ఆస్తి విలువలో 20 శాతం లాంగ్ టర్మ్ ట్యాక్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సర్ చార్చ్, సెస్ అదనం.

Updated Date - 2021-09-29T04:44:16+05:30 IST