వైసీపీ ప్రభుత్వానికి ముందుచూపు లేదు

ABN , First Publish Date - 2020-11-30T05:54:30+05:30 IST

ముందు చూపు లేకపోవడంతో ప్రభుత్వం కరోనా సాకు చూపి పుష్కరాల్లో నదీస్నానాలు లేకుండా చేసిందని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి ముందుచూపు లేదు
సమావేశంలో మాట్లాడుతున్న తిక్కారెడ్డి

  1. పుష్కర నిధులపై విచారణ జరపాలి 
  2. టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి తిక్కారెడ్డి 

కౌతాళం, నవంబరు 29: ముందు చూపు లేకపోవడంతో  ప్రభుత్వం కరోనా సాకు చూపి పుష్కరాల్లో నదీస్నానాలు లేకుండా చేసిందని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు. మండలంలోని తోవిలో విలేఖరుల సమావేశంలో  మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శించారు. తెలంగాణ, కర్నాటకలలో పుష్కర స్నానాలకు అనుమతులు ఇచ్చారని, మరి అక్కడ కరోనా లేదా అని ప్రశ్నించారు. తుంగభద్ర డ్యాంలో పుష్కలంగా నీరున్నా పుష్కరాలకు నీరు విడుదల చేయలేదని, దీంతో దీంతో బురదనీరే గతి అయిందన్నారు. రూ.260తో నిర్మించిన పుష్కర ఘాట్ల పనుల్లో భారీ అవినీతి జరిగిందని టీడీపీ నిజనిర్ధాణ కమిటీ సభ్యుల పరిశీలనలో రూ.70 కోట్లకు మించి ఖర్చు చేయలేదని తేలిందన్నారు. మరి మిగతా డబ్బు ఎక్కడికి పోయిందని, కాంట్రాక్టర్లు తిన్నారా? ప్రజాప్రతినిధులు తిన్నారా ? తేల్చాలని కోరారు. పుష్కరాల పనుల్లో అక్రమాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అవినీతి అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు   చంద్రబాబు పాలనను పోగొట్టుకున్నామని బాధపడుతున్నా రని అన్నారు. వైసీపీ వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇసుక సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితి ప్రభుత్వానిదన్నారు. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విఽధానాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. చెన్నబసప్ప గౌడ్‌, సుధీర్‌రెడ్డి, సురేష్‌ నాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T05:54:30+05:30 IST