పుష్ప సినిమాను ఫాలో అయిన తమిళనాడు దొంగలు.. వీరి ప్లాన్ ముందు సినిమా సీన్లు కూడా దిగదుడుపే..

ABN , First Publish Date - 2022-02-12T01:08:06+05:30 IST

సినిమాల ప్రభావమో ఏమో గానీ దొంగలు ఇటీవల చాలా తెలివిమీరిపోయారు. కొందరు సినిమాను చూసి ప్రేరణ పొంది.. ఫైనల్‌గా సినిమా సీన్లను తలదన్నేలా ప్లాన్‌లు వేసి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చోరీలు చూసినప్పుడు...

పుష్ప సినిమాను ఫాలో అయిన తమిళనాడు దొంగలు.. వీరి ప్లాన్ ముందు సినిమా సీన్లు కూడా దిగదుడుపే..
పోలీసులు సీజ్ చేసిన బస్సు

సినిమాల ప్రభావమో ఏమో గానీ దొంగలు ఇటీవల చాలా తెలివిమీరిపోయారు. కొందరు సినిమాను చూసి ప్రేరణ పొంది.. ఫైనల్‌గా సినిమా సీన్లను తలదన్నేలా ప్లాన్‌లు వేసి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చోరీలు చూసినప్పుడు ప్రజలతో పాటూ పోలీసులు కూడా అవాక్కవుతుంటారు. తమిళనాడుకు చెందిన కొందరు దుండగులు  వేసిన మాస్టర్ ప్లాన్ అందరికీ దిమ్మతిరిగేలా చేసింది. వివరాల్లోకి వెళితే..


తమిళనాడు నంబర్‌తో రిజిస్టర్ అయిన ఓ ఆర్టీసీ బస్సు.. 36 మంది ప్రయాణికుతో తిరుపతి నుంచి తమిళనాడులోని తిరుపత్తూర్‌కి బయలుదేరింది. తిరుపతిలో పెళ్లికి వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో బస్సులో బయలుదేరారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓ బస్సు చెక్‌పోస్టుల వద్ద వేగంగా వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అన్ని బస్సులనూ మరింత క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి బస్సును కూడా ఆపే ప్రయత్నం చేశారు. కానీ, ఆ వాహనం ఆగకుండా వేగంగా వెళ్లడం గమనించి వెంటనే బస్సును పోలీసులు వెంబడించారు.

భార్య, నలుగురు పిల్లలతో పెళ్లికి వెళ్లి కారులో తిరిగొస్తున్న భర్త.. అర్ధరాత్రి 12 గంటలకు అతడు సజీవదహనం.. అసలేమైందంటే..


పెళ్లి బస్సును వెంబడించి ఆపి, తనిఖీ చేయగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు వ్యక్తులు డ్రైవర్, కండక్టర్‌కు కత్తి చూపించి బెదిరించినట్లు తెలిసింది. బస్సులోని వారందరినీ కిందకు దింపేసి, ఎర్రచందనం దుంగలను అందులో తరలిస్తున్నట్లు తేలింది. డ్రైవర్, కండక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శేషాచలం అడవుల నుంచి వీటిని తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఎర్రచందనం తరలింపులో స్మగ్లర్లు ఇటీవల వింత వింత ఐడియాలు వేస్తుండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

ప్రియుడు అందుకు ఒప్పుకోలేదని కోపం పెంచుకుంది... ఓ రోజు అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి ఆమె ఏం చేసిందంటే..

Updated Date - 2022-02-12T01:08:06+05:30 IST