Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 31 Mar 2022 16:26:14 IST

అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. యువతి బెడ్‌రూంలోకి వెళ్లి కత్తితో బెదిరించగానే.. ఆమె ఇచ్చిన రియాక్షన్..

twitter-iconwatsapp-iconfb-icon
అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. యువతి బెడ్‌రూంలోకి వెళ్లి కత్తితో బెదిరించగానే.. ఆమె ఇచ్చిన రియాక్షన్..

ఆడవారే కదా ఏం చేస్తారులే అనుకునే వారు ఒక్కోసారి అవాక్కవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దాడులు, అత్యాచారాలు ఎక్కువైన నేటి సమాజంలో మగవారితో పోరాడి తమను తాము రక్షించుకునే ఆడవారు కూడా ఉన్నారు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే గుజరాత్‌లో ఓ యువతి చేసిన సాహసానికి దొంగలు కూడా షాక్ అయ్యారు. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. నేరుగా యువతి బెడ్‌రూంలోకి వెళ్లారు. యువతికి కత్తి చూపించి బెదిరించాలని చూశారు. తర్వాత ఆమె ఇచ్చిన రియాక్షన్‌తో చివరికి ఏమైందంటే..

అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. యువతి బెడ్‌రూంలోకి వెళ్లి కత్తితో బెదిరించగానే.. ఆమె ఇచ్చిన రియాక్షన్..

గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని కడోదర పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన రియా స్వైన్‌ అనే యువతి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. పరీక్షలు ఉండడంతో ఇటీవల రోజూ రాత్రిళ్లు చదువుకుంటోంది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి చదువుకుంటూ ఉండగా.. ఇంటి వెనుక వైపు తలుపు వద్ద దబేల్‌మని శబ్దం వినిపించింది. దీంతో యువతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంత రాత్రి వేళ ఎవరు శబ్దం చేస్తున్నారు! అని ఆలోచించే లోపే ముగ్గురు దొంగలు లోపలికి వచ్చారు. ముందుగా ఓ దొంగ రియా గొంతు మీద కత్తి పెట్టి బెదిరించాడు. మిగతా ఇద్దరు దొంగలు పక్కనే పడుకుని ఉన్న రియా చెల్లెలి వద్దకు వెళ్లారు. దీంతో రియా ఒక్కసారిగా గుండె ధైర్యం తెచ్చుకుని తన ముందున్న దొంగను.. గట్టిగా ఒక్క తోపు తోసింది. ఈ క్రమంలో దొంగ చేతిలో ఉన్న కత్తి కోసుకోవడం వల్ల రియా చేతికి తీవ్ర గాయమైంది.

ప్రియుడు పిలవడంతో డిన్నర్‍‍‌కు వెళ్లిన యువతి.. అనంతరం రాత్రి అతడి గదికి వెళ్లగా.. లోపల ఊహించని విధంగా..

అయినా ఆమె లెక్కచేయకుండా పక్కన పడుకుని ఉన్న చెల్లెలిని తన వైపునకు లాగింది. తర్వాత ఇద్దరూ కలిసి గట్టిగా కేకలు పెట్టారు. దీంతో వారి తల్లిదండ్రులు, చుట్టు పక్కల వారంతా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దీంతో దొంగలు భయంతో అక్కడి నుంచి ఉడాయించారు. మొత్తానికి ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యువతి ధైర్యసాహసాలను అంతా మెచ్చుకున్నారు. అయితే దీనిపై పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేసుకోవడంతో పాటూ నిందితులను పట్టుకోవడంలో కూడా నిర్లక్ష్యం వహించడంపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొంగలను త్వరగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఛీ! వీడసలు మనిషేనా.. ప్రాణంగా చూసుకోవాల్సిన భార్యను.. సోదరుడు, బాలుడితో కలిసి పొలాల్లోకి తీసుకెళ్లి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఇంకోసారి అతన్ని కలవొద్దంటూ కూతురికి సూచించిన తల్లి.. ఓ రోజు తల్లి పడుకుని ఉండగా.. ప్రియుడిని ఏకంగా ఇంటికే పిలిచి...ఈ ఎస్‌ఐ మరీ ఇంత శాడిస్టా.. ఉద్యోగం పేరుతో యువకుడిని 6నెలల పాటు ఒకే గదిలో ఉంచి మరీ..‘‘సమాజానికి భయపడకు.. మన ప్రేమ గురించి అందరికీ చెప్పు’’.. అంటూ వరుడి ముందే వధువుకు ధైర్యం చెప్పిన యువకుడు.. తర్వాత..videoభర్త మెసేజ్ చేయడంతో న్యూడ్ ఫొటోలు పంపిన భార్య.. కొన్నాళ్లకు అనుమానం వచ్చి ఆరాతీయగా..బరువు తగ్గాలనుకునేవారికి ఈ 6రకాల బియ్యం అద్భుతంతా పని చేస్తాయి... అవేంటో తెలుసుకుందామా..మేడమ్! ఆటోలో పెట్రోల్ అయిపోయింది.. పట్టుకొస్తానంటూ వెళ్లాడు.. తర్వాత స్నేహితుడితో కలిసి వచ్చి..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.