దొంగిలించిన బైక్‌ను తిరిగి పార్శిల్ ద్వార పంపించిన ‘మంచి’ దొంగ

ABN , First Publish Date - 2020-06-01T17:30:01+05:30 IST

బైక్‌ను చోరీ చేసిన ఓ దొంగ 15రోజుల తర్వాత దాన్ని తిరిగి పార్శిల్ ద్వార యజమానికి పంపించిన ఘటన....

దొంగిలించిన బైక్‌ను తిరిగి పార్శిల్ ద్వార పంపించిన ‘మంచి’ దొంగ

కోయంబత్తూర్ (తమిళనాడు): బైక్‌ను చోరీ చేసిన ఓ దొంగ 15రోజుల తర్వాత దాన్ని తిరిగి పార్శిల్ ద్వార యజమానికి పంపించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ నగరంలోని పల్లపాలాయం ప్రాంతంలో వెలుగుచూసింది. కోయంబత్తూర్ నగరానికి చెందిన సురేష్ తన బైక్ ను వర్క్ షాపు ముందు  పార్కింగ్ చేశాడు. గత నెల 18వతేదీన తన బైక్ ను ఎవరో చోరీ చేశారని సురేష్ సూలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ కు ఓ పార్శిల్ ఏజెన్సీ నుంచి పార్శిల్ వచ్చిందంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. పార్శిల్ లో చోరీ అయిన తన బైక్ రావడం చూసి సురేష్ ఆశ్చర్యపోయాడు. 1400 రూపాయలు పార్శిల్ ఏజెంటుకు చెల్లించి బైక్ తీసుకున్నాడు. ఎవరో వలసకార్మికుడు బైక్ ను చోరీ చేసి తీసుకువెళ్లి గమ్యస్థానం చేరాక, దాన్ని పార్శిల్ ద్వార తిరిగి పంపించాడని సురేష్ చెప్పారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు. బైక్ చోరీ చేసి తిరిగి ఇచ్చిన మంచి దొంగను సురేష్ అభినందించడం విశేషం. 

Updated Date - 2020-06-01T17:30:01+05:30 IST