అతను అప్పటికి అదే షాపులో 11 సార్లు దొంగతనానికి పాల్పడ్డాడు.. తాజాగా 12వ సారి కూడా చోరీకి పాల్పడ్డాడు.. అయితే దొంగతనం తర్వాత నిద్ర ముంచుకు రావడంతో ఆ షాపు ముందే నిద్రపోయాడు.. ఉదయాన్నే అతడిని చూసిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సికార్‌లోని రవి గనోడియా అనే వ్యక్తి కిరణ్ డిపార్ట్మెంటల్ స్టోర్‌ను నడుపుతున్నాడు.
అదే స్టోర్‌లో సుశీల్ శర్మ అనే దొంగ గత రెండు నెలల్లో మొత్తం 11 సార్లు దొంగతనాలకు పాల్పడ్డాడు. మొత్తం రూ.2 లక్షల విలువైన సామాన్లు పట్టుకుపోయాడు. గత ఆదివారం రాత్రి అదే స్టోర్‌కు దొంగతనం కోసం మళ్లీ వెళ్లాడు. చోరీ అనంతరం షాపు వెలుపల ఉన్న ప్లాట్‌ఫామ్‌పై నిద్రపోయాడు. ఉదయాన్నే షాప్ తెరిచేందుకు వచ్చిన రవి.. తన షాపు ముందు నిద్రపోతున్న దొంగను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుశీల్‌ను అరెస్ట్ చేశారు.
విచారణలో నిందితుడు నిజం అంగీకరించాడు. గతంలో కూడా 11 సార్లు అదే దుకాణంలో దొంగతనానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. ప్రతిసారి దొంగతనం తర్వాత అక్కడే పడుక్కుని తెల్లవారు ఝామున 4 గంటలకు లేచి వెళ్లిపోయేవాడినని, ఈ సారి తెలివి రాలేదని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి