మార్పును కోరుతుండ్రు

ABN , First Publish Date - 2022-07-02T05:15:54+05:30 IST

తెలంగాణలో ప్రజలు మార్పుని కోరుకుంటు న్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీరథ్‌సింగ్‌ రావత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

మార్పును కోరుతుండ్రు
మహబూబ్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీరథ్‌సింగ్‌ రావత్‌

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి బీజేపీ

వంటింటి వరకూ చేరిన మోదీ సర్కార్‌ ఫలాలు

ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీరథ్‌సింగ్‌ రావత్‌

జిల్లాలో రెండో రోజుకు చేరిన నాయకుల సమావేశాలు


మహబూబ్‌నగర్‌, జూలై 1 (ఆంరఽధజ్యోతి): తెలంగాణలో ప్రజలు మార్పుని కోరుకుంటు న్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం తీరథ్‌సింగ్‌ రావత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యం లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తోన్న ఆయన శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకు మునుపు ఉదయం ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా శాఖ కార్యాలయాన్ని సందర్శించి, అక్కడ కార్యకర్తలతో సమావేశమ య్యారు. ఆ తర్వాత పార్టీ జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా, కిసాన్‌ మోర్చా, ఎస్సీ, ఎస్టీ మో ర్చాలతో సమీక్షలు జరిపారు. విలేకరుల సమావేశం అనంతరం బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఎన్నో ఆకాంక్షలు, లక్ష్యాలు, త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణలో అవేవీ నెరవేరలేదని, కొన్ని కుటుంబాలకే ఫలాలు దక్కా యని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతికర ప్రభుత్వమని ఆరోపించారు. అవినీతి, కుటుంబ పాలనకు దేశంలో తావులేదని, తెలంగాణలోనూ ఈతరహా పాల నకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. కేంద్ర పథకాలను ప్రతీ కార్యకర్త ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలన్నారు. ప్రపంచ దేశాలు నేడు మోదీ పాలనను ప్రశంసిస్తున్నా యన్నారు. విశ్వగురువుగా భారత్‌ ప్రతిష్టను మోదీ పెంచారని తెలిపారు. కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ ్గసభ్యులు పడాకుల బాలరాజు, పద్మజారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, బురుజు రాజేందర్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్‌ అచ్చుగట్ల అంజయ్య, పోతులరాజేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


సభను విజయవంతం చేయాలి

దేవరకద్ర: హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలని కర్ణాటక మాజీ ముఖ్య మం త్రి సదానం దగౌడ్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రానికి వచ్చిన ఆయనకు పార్టీ రాష్ట్ర నాయకుడు డోకూరు పవన్‌కుమార్‌ రెడ్డి, మండల నాయకులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు యాజ్ఞభూపాల్‌ రెడ్డి, నారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు కొండ అంజన్‌ కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేషకుమార్‌ పాల్గొన్నారు.


ప్రతీ కుటుంబానికి లబ్ధి

జడ్చర్ల: దేశంలోని ప్రతీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి చేకూరుతోందని గుజరాత్‌ మాజీ ముఖ్య మంత్రి విజయ్‌రుపానీ అన్నారు. జడ్చర్ల పట్టణంలోని ప్రేమ్‌రంగా గార్డెన్స్‌లో శుక్రవారం పార్టీ బూత్‌లెవల్‌ అధ్య క్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు నాగసాల సమీపంలోని స్వామినారాయ ణ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. జడ్చర్ల మునిసిపాలి టీలోని 10వ వార్డులో కుమ్మరివాడలో పర్యటించి, కుండల తయారీని పరిశీ లించారు. అనురాగిణి ఆశ్రమంలోని చిన్నారులతో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌ యాదవ్‌, రాపోతుల శ్రీనివాస్‌గౌడ్‌, నాగరాజు, కౌన్సిలర్‌ కుమ్మరి రాజు, రాజశేఖర్‌రెడ్డి, సాహితిరెడ్డి, రమేశ్‌, శ్రీనాథ్‌ పాల్గొన్నారు. 


తెలంగాణలో బీజేపీదే అధికారం

చిన్నచింతకుంట/అడ్డాకుల: తెలంగాణాలో ప్రజలంతా తమ పార్టీ వైపు చూస్తున్నారని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ శివప్ప షట్టర్‌ తెలిపారు. శుక్రవారం చిన్నచింతకుంట బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజు, గుబ్బ శ్రీనివాసులు పాల్గొన్నారు. అడ్డాకుల మండల కేంద్రానికి సమీపంలో ఉన్న మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఫాంహౌజ్‌లో నిర్వహించిన బీజేపీ సమావేశానికి జగదీశ్‌ షెట్టర్‌ హాజరై మాట్లాడారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎగ్గని నర్సింహులు, రవీంద్రనాథ్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


కొనసాగిన సమీక్షలు

 మహబూబ్‌నగర్‌,(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధమవ్వాలని ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులు, నాయకులు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ జాతీయ నాయకులు రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. శుక్రవారం మహబూ బ్‌నగర్‌ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు విజయ్‌రూపానీ, తీరథ్‌సింగ్‌ రావత్‌, జగదీష్‌ షెట్టర్‌ పర్యటించారు. పార్టీ క్యాడర్‌తో పలు సమీక్షలు జరిపారు.  జోగుళాంబ గద్వాల నియోజకవర్గంలో బీజేపీ జాతీయ మాజీ కార్యదర్శి ఆశీష్‌ సూద్‌, అలంపూర్‌ నియోజకవర్గంలో పాట్నా ఎమ్మెల్యే ప్రేమ్‌కుమార్‌లు బీజేపీలోని కిసాన్‌, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ మోర్చాలతో సమావేశాలు నిర్వహించారు. నారా యణపేట జిల్లా మక్తల్‌లో జరిగిన బీజేపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కర్ణాటక మాజీ సీఎం సదానంద గౌడ, నారాయణ పేటలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తలు, వివిధ మోర్చాల సమీక్ష సమావేశంలో గోవా మంత్రి విశ్వజిత్‌ రాణే పాల్గొన్నారు. గుజరాత్‌  మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌భాయ్‌ పటేల్‌ తెలకపల్లి మండ లంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. కొల్లాపూర్‌లో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు పొన్ను రాధాకృష్ణన్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు ఏ రాములు పర్యటించారు.  వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ కోశాధికారి రాజేష్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:15:54+05:30 IST