అటవీ ప్రాంతంలో, గడ్డకట్టే చలిలో.. పురిటినొప్పులతో గర్భిణి అవస్థలు.. ఇంతలో వారంతా గుంపులుగా వచ్చి..

ABN , First Publish Date - 2022-01-10T00:59:45+05:30 IST

ఓ వైపు మంచు విపరీతంగా కురుస్తోంది. మరోవైపు గడ్డ కట్టే చలి. మామూలు వ్యక్తులే తట్టుకోలేని వాతావరణం ఉన్న ఆ ప్రాంతంలో ఓ గర్భిణికి పురటినొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులకు ఏమీ తోచలేదు. ఇంతలో..

అటవీ ప్రాంతంలో, గడ్డకట్టే చలిలో.. పురిటినొప్పులతో గర్భిణి అవస్థలు.. ఇంతలో వారంతా గుంపులుగా వచ్చి..

గర్భిణిగా ఉన్న సమయంలో మహిళల ఇబ్బందులు.. వారికి మాత్రమే తెలుసు. పుట్టబోయే బిడ్డ కోసం, చిన్నారి భవిష్యత్ కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా పంటి బిగువున భరిస్తుంటారు. మన చుట్టుపక్కల ఉన్న మహిళల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక గడ్డ కట్టే చలిలో, అటవీ ప్రాంతంలో ఉండే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. వింటేనే అయ్యో పాపం.. అనిపిస్తుంది కదా. జమ్మూ కాశ్మీర్‌లో ఓ నిండు గర్భిణికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ వైపు మంచు విపరీతంగా కురుస్తోంది. ఎలాంటి రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతంలో ఉన్న గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. తర్వాత ఏం జరిగిందంటే..


అది జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా పరిధిలోని రామ్‌నాగ్రి ఘజ్జర్ లోయ ప్రాంతం. ఓ వైపు మంచు విపరీతంగా కురుస్తోంది. మరోవైపు గడ్డ కట్టే చలి. మామూలు వ్యక్తులే తట్టుకోలేని వాతావరణం ఉన్న ఆ ప్రాంతంలో ఓ గర్భిణికి పురటినొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులకు ఏమీ తోచలేదు. ఇంతలో కొందరు ఆర్మీ సిబ్బందికి సమాచారం అందించారు. ఎక్కడ.. ఏ ఆపద వచ్చినా ముందుండే ఆర్మీ సైనికులు.. ఈ వార్త వినగానే క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. గర్భిణి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి.. ఓ స్టెచర్‌లో ఆమెను మోసుకుంటూ వచ్చారు. సమీపంలోని ఆస్పత్రికి సురక్షితంగా చేర్చడంతో ప్రజలంతా సైనికులను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

తల్లిపాలతో ఆభరణాల తయారీ.. మహిళల నుంచి వెల్లువెత్తుతున్న ఆర్డర్లు.. ఎక్కడో తెలుసా..



Updated Date - 2022-01-10T00:59:45+05:30 IST