$250 బిలియన్లను కోల్పోయారు * స్టాక్ మార్కెట్ పతనం ఫలితం

ABN , First Publish Date - 2022-07-04T01:34:47+05:30 IST

అమెరికన్ స్టాక్ మార్కెట్ల పతనం నేపథ్యంలో పది మంది ప్రపంచ ధనవంతులు $250 బిలియన్లను కోల్పోయారు.

$250 బిలియన్లను కోల్పోయారు  * స్టాక్ మార్కెట్ పతనం ఫలితం

న్యూయార్క్ : అమెరికన్ స్టాక్ మార్కెట్ల పతనం నేపథ్యంలో  పది మంది ప్రపంచ ధనవంతులు $250 బిలియన్లను కోల్పోయారు. ఓ నివేదిక ప్రకారం... టెస్లా CEO ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ సహా ప్రపంచంలోని పది మంది ధనవంతులు ఈ సంవత్సరం వారి నికర విలువలో $250 బిలియన్ల పతనాన్ని చవిచూడాల్సి వచ్చింది.


మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మస్క్, బెజోస్, లూయిస్ విట్టన్ యజమాని LVMH యొక్క CEO బెర్నార్డ్ ఆర్నాల్ట్  ఈ జాబితాలో ఉన్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థలో దాదాపు 1.2%కి సమానమైన నష్టాన్ని మస్క్, బెజోస్ ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆర్థిక అనిశ్చితి ఒకవైపు, ట్విట్టర్‌ కొనుగోలు యత్నం మరోవైపు... టెస్లా షేర్ ధర ఈ సంవత్సరం 43% మేర క్షీణించింది, ఇక... అమెజాన్ షేర్లు 2022 ప్రారంభం నుండి 35% కంటే ఎక్కువ తగ్గాయి.


ఇక... జాబితాలో ఉన్న ఇద్దరు భారతీయులు, గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ... వారి సంపద నికర విలువపరంగా $22.1 బిలియన్, $3.05 బిలియన్ల పెరుగుదలను పొందడం గమనార్హం. అదానీ... నౌకాశ్రయాలు, బొగ్గుగనుల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. మరో వ్యాపారవేత్త అంబానీ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-07-04T01:34:47+05:30 IST