హామీలు మరచి భారం మోపుతున్నారు

ABN , First Publish Date - 2022-09-25T07:05:52+05:30 IST

: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్‌రెడ్డి మరచి వివిధ రకాల భారాలను ప్రజలపై మోపుతున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు.

హామీలు మరచి భారం మోపుతున్నారు
కరపత్రాలు అందజేస్తున్న టీడీపీ నేతలు

గిద్దలూరు, సెప్టెంబరు 24 : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్‌రెడ్డి మరచి వివిధ రకాల భారాలను ప్రజలపై మోపుతున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. మండలంలోని కంచిపల్లి గ్రామంలో శనివారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరల వివరాల కరపత్రాలను ఇంటింటికి తిరి గి పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో అలివికాని హామీలను జగన్‌రెడ్డి ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. దీనికి తోడు ప్రజలపై రకరకాల పన్నులు విధిస్తూ చార్జీలను పెంచుతూ నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారితో ప్రజల ఆర్ధిక పరిస్థితి దిగజారినా, పేదలపై విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, నిత్యవసర వస్తువుల ధరలు పెంచారన్నారు. గ్రామాలలో చిన్నపాటి అభివృద్ధి కూడా చేయలేకపోవడాన్ని ప్రజలకు వివరించారు. బాదుడేబాదుడు కార్యక్రమంలో కంచిపల్లి పంచాయతీ టీడీపీ నాయకులు దప్పిలి రంగస్వామిరెడ్డి, దప్పిలి రవికుమార్‌రెడ్డి, షేక్‌ మస్తాన్‌, షేక్‌ రసూల్‌, మీనిగ రంగస్వామి, కె.రమేష్‌, షేక్‌ ఖాదర్‌వలి, తదితరులతోపాటు టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్‌ పెద్దమస్తాన్‌, పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు గోపారపు గోపాల్‌రెడ్డి, పార్లమెంటు అధికార ప్రతినిధి షేక్‌ పెద్దభాషా, టీడీపీ నాయకులు పాలుగుళ్ళ చిన్నశ్రీనివాసరెడ్డి, షాన్షావలి, వెంకటప్ప, వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T07:05:52+05:30 IST