వారి ఉద్దేశమే లోపభూయిష్టం: అనురాగ్ ఠాకూర్

ABN , First Publish Date - 2020-09-18T21:45:16+05:30 IST

వారి ఉద్దేశమే లోపభూయిష్టం: అనురాగ్ ఠాకూర్

వారి ఉద్దేశమే లోపభూయిష్టం: అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ: పీఎం కేర్‌కు వచ్చిన విరాళాల లెక్కలు అడగడంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివృద్ధి పనిలో ప్రతిపక్షాలు లోపాలు వెతుకుతున్నాయని నిజానికి వారి ఉద్దేశాలు లోపభూయిష్టమని ఆయన విమర్శలు గుప్పించారు. వర్షాలకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ఆయన విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.


‘‘పీఎం కేర్ ఫండ్‌ను వారు (కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు) వ్యతిరేకిస్తున్నారు. ఇలాగే ఈవీఎంలను వ్యతిరేకించారు. కానీ ఎన్నికల్లో ఏం జరిగింది? వారు ఓడుతూ వస్తున్నారు. అంతే కాకుండా జన్‌ధన్, నోట్లరద్దు, త్రిపుల్ తలాక్, జీఎస్‌టీ దేశానికి హాని చేసేవిగా వర్ణించారు. ప్రతిదాంట్లో వారు తప్పులు, లోపాలు వెతకడానికే ప్రయత్నిస్తున్నారు. నిజానికి వాటిల్లో కాదు.. వారి ఆలోచనల్లోనే లోపం ఉంది’’ అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

Updated Date - 2020-09-18T21:45:16+05:30 IST