అవి రెండు పులులు!

ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST

విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో తిరుగుతున్నవి రెండు పులులని అటవీశాఖాధికారులు నిర్ధారణకు వచ్చారు.

అవి రెండు పులులు!


రెండు జిల్లాల్లో తిరుగుతున్నట్లు నిర్ధారణ
కొత్తవలస, ఆగస్టు 10:
   విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో తిరుగుతున్నవి రెండు పులులని అటవీశాఖాధికారులు నిర్ధారణకు వచ్చారు. మెంటాడ మండలంలో గొర్రెలపై పులి దాడి చేసినమంగళవారం నాడే అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామ శివారులో గేదెపై పులి దాడి చేసి చంపేసిన ఘటన చోటుచేసుకుంది. దీంతో రెండు పులులు సంచరిస్తున్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అనకాపల్లి, విజయనగరం జిల్లాల సరిహద్దు మండలాలైన కొత్తవలస, కె.కోటపాడు, సబ్బవరంలో ఒక పులి సంచరిస్తోంది. ఇది పశువులపై దాడులు చేసి ఆవులు, గేదెలను చంపేస్తోంది. మంగళవారం కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో పశువుల పాకలో నున్న గేదెను చంపేసింది. ఈ ఘటనలపై కొత్తవలస, కె.కోటపాటు, సబ్బవరం మండలాలకు చెందిన సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
-----------------------------
 

Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST