గిరి ఒలింపిక్‌ విజేతలు వీరే

ABN , First Publish Date - 2021-01-26T05:46:27+05:30 IST

ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ, గురు కుల పాఠశాలల విద్యార్థులకు ఎన్టీఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి గిరి ఒలింపిక్‌ క్రీడల విజేతలను ప్రకటించారు.

గిరి ఒలింపిక్‌ విజేతలు వీరే
వాలీబాల్‌ ఆడుతున్న క్రీడాకారిణులు

సీతంపేట : ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ, గురు కుల పాఠశాలల విద్యార్థులకు ఎన్టీఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి గిరి ఒలింపిక్‌ క్రీడల విజేతలను ప్రకటించారు. బాలికల విభాగంలో వాలీబాల్‌లో బొమ్మికి, బ్యాడ్మింటన్‌లో బడ్డుమాసింగ్‌, క్యారమ్స్‌లో బుడంబో విజేత లుగా నిలిచాయి. 100 మీటర్ల రన్నింగ్‌లో పూతికవలస, 400, 1500  మీటర్లలో సీతంపేట, లాంగ్‌జంప్‌లో పూతిక వలస, హైజంప్‌, షార్ట్‌ఫుట్‌లో బందపల్లి, డిస్క త్రోలో బొమ్మికి, జావెలెన్‌త్రోలో సవరబొంతు పాఠశాలలు విజేతలుగా నిలిచాయి. బాలుర వి భాగంలో వాలీబాల్‌లో గంగమ్మపేట, కబడ్డీలో చినబగ్గ, బ్యాడ్మింటన్‌లో సీతంపేట, క్యారమ్స్‌లో శ్రీకాకు ళం విజేతలుగా నిలిచాయి. 100 మీటర్ల రన్నింగ్‌లో శ్రీకాకుళం, 400 మీటర్లలో సీతం పేట, 1500 మీటర్లలో లాబర, లాంగ్‌జంప్‌లో మల్లి, హైజంప్‌లో ఎంజీపురం, షార్ట్‌ఫుట్‌లో చినబగ్గ, డిస్కత్రోలో పీఎల్‌పురం పాఠశాలలు విజేతలుగా నిలిచాయి. వ్యక్తిగతంగా బాలికల విభాగంలో చాంపియన్‌గా పూతికవలస ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎ.శాంతి, బాలుర విభాగంలో చాంపియన్‌గా సీతంపేట వివేకనందా విద్యా విహార్‌కు చెందిన ఎం.అభిరామ్‌ నిలిచారు. బాలికల విభాగం లో ఓవరాల్‌ చాంపియన్‌గా సీతంపేట బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు నిలిచారు. విజేతలకు రిపబ్లిక్‌ డే సందర్భంగా మంగళవారం బహుమతులు ప్రదానం చేయ నున్నట్లు డీడీ ఎం.కమల,  గిరి ఒలింపిక్స్‌ స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి జాకబ్‌ దయానందం, పీడీ భాస్కరరావు తెలిపారు. 

 

Updated Date - 2021-01-26T05:46:27+05:30 IST