ఈ స్టాక్స్... అదుర్స్...

ABN , First Publish Date - 2021-08-04T00:39:53+05:30 IST

మంచి పనితీరును కనబరచి, పెట్టుబడిదారులకు సిరులు కురిపించే కంపెనీలను దేశీయ బ్రోకరేజ్ / రీసెర్చ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ గుర్తించింది.

ఈ స్టాక్స్... అదుర్స్...

హైదరాబాద్ : మంచి పనితీరును కనబరచి, పెట్టుబడిదారులకు సిరులు కురిపించే కంపెనీలను దేశీయ బ్రోకరేజ్ / రీసెర్చ్ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ గుర్తించింది. ఆగస్ట్‌ నెలకు సంబంధించి ఆ టాప్ స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. వాటిలో ఒకటి కెమికల్స్ కంపెనీ క్యామ్లిన్ లైఫ్ సైన్సెస్. దీని షేర్‌ ఒక్కొక్కటి రూ. 215.  ట్రెడిషనల్ యాంటీ ఆక్సిడెంట్‌లను తయారు చేసే ప్రముఖ సంస్థల్లో క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ కూడా ఒకటి. ఈ కంపెనీ షేర్లు కేవలం ఏడాదిలో 140 శాతం కంటే ఎక్కువగానే పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలో ఈ రోజు వరకు దాని షేర్లు 50 % మేర ర్యాలీ చేయడం విశేషం. ముడి పదార్థాల ధరలు తగ్గడంతో అది మార్జిన్‌లకు కలిసి వచ్చింది. మీడియం టెర్మ్‌లో స్పెషాలిటీ కెమికల్స్ ఇండస్ట్రీ మరింత అద్భుతమైన పని తీరును కనబరిచే అవకాశమున్నట్లు చెబుతున్నారు. 

Updated Date - 2021-08-04T00:39:53+05:30 IST