దేశంలోని 69 జిల్లాల్లో కరోనా మరణ మృదంగం

ABN , First Publish Date - 2020-06-12T14:10:35+05:30 IST

దేశంలోని 13 రాష్ట్రాల్లోని 69 జిల్లాల్లో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు....

దేశంలోని 69 జిల్లాల్లో కరోనా మరణ మృదంగం

మరణాల రేటు జాతీయ సగటు కంటే అధికం

న్యూఢిల్లీ : దేశంలోని 13 రాష్ట్రాల్లోని 69 జిల్లాల్లో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో జాతీయ సగటున కరోనా వల్ల 2.90 శాతం మరణాల రేటు ఉండగా, 69 జిల్లాల్లో మాత్రం మరణాల రేటు 5 శాతానికి చేరుకోవడం కలవరం రేపుతోంది. మొత్తంమీద విదేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉన్నా 69 జిల్లాల్లో మాత్రం కరోనా మృతుల సంఖ్య అధికంగా ఉంది.


మే 18వతేదీన కరోనా మరణాల రేటు 2.96 శాతం కాగా, ప్రస్థుతం మరణాల జాతీయ సగటు 2.90కు తగ్గిందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా చెప్పారు. కొవిడ్ -19 వల్ల మే 18 న కరోనా కేసుల సంఖ్య 1,00,800 కాగా, జూన్ 10 కల్లా 2,87,155కు పెరిగాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య కూడా 3,156 నుంచి 8,108కి పెరిగాయి. కరోనా మరణాల్లో అధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. దేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 21 జిల్లాలు, ఉత్తరప్రదేశ్ లో 11, గుజరాత్ లో 9, రాజస్థాన్ లో 5, తెలంగాణలో 3 జిల్లాల్లో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. 

Updated Date - 2020-06-12T14:10:35+05:30 IST