గుండె బలంగా ఉండాలంటే...!

ABN , First Publish Date - 2022-07-11T17:51:17+05:30 IST

మన శరీరంలో అత్యంత సంక్లిష్టమైన అవయవాలలో గుండె ఒకటి. గుండె ఒక్క సెకను ఆగితే చాలు..

గుండె బలంగా ఉండాలంటే...!

మన శరీరంలో అత్యంత సంక్లిష్టమైన అవయవాలలో గుండె ఒకటి. గుండె ఒక్క సెకను ఆగితే చాలు.. మనిషి ప్రాణానికే ముప్పు వస్తుంది. అలాంటి గుండెను ఆరోగ్యంగా ఉంచే పళ్లు ఏమిటో చూద్దాం..


దానిమ్మ

రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా దానిమ్మ గింజలు ఎంతో ఉపకరిస్తాయి. ప్రతి రోజు దానిమ్మ రసం తాగటం వల్ల రక్తనాళాలలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడవు.


అవకాడో

అవకాడోలో గుండెకు ఎంతో మేలు చేసే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పౌష్టికాహార నిపుణుల అంచనాల ప్రకారం- ఒక అవకాడోలో 974 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. దీనితో పాటుగా అవకాడోకు చెడు కొలస్ట్రాల్‌ను నియంత్రించే గుణం ఉంది. చెడు కొలస్ట్రాల్‌ ఎంత తక్కువ ఉంటే గుండె అంత ఆరోగ్యంగా ఉంటుంది. 


పుచ్చకాయ

మన శరీరానికి ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించటంలో పుచ్చకాయ తోడ్పడుతుంది. పుచ్చకాయలో ఉండే సిట్రూలైన్‌ అనే అమినో యాసిడ్‌ వల్ల బ్లడ్‌ ప్రెషర్‌ తగ్గుతుంది. అంతే కాకుండా దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌ మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి.


బెర్రీలు..

స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ- ఇలాంటి పళ్లు మనకు ఇప్పుడు సమృద్ధిగా దొరుకుతున్నాయి. బెర్రీలను తినటం వల్ల మన శరీరంలో ఉండే చెడు కొలస్ట్రాల్‌ తగ్గుతుంది. అంతే కాకుండా బెర్రీలలో యాంథోసైనాన్స్‌ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. 









Updated Date - 2022-07-11T17:51:17+05:30 IST