బంధుత్వాలను అర్థం చేసుకుంటే సమాధానం సులువే..!

ABN , First Publish Date - 2022-07-02T20:09:32+05:30 IST

ప్రతి పోటీపరీక్షల్లోనూ రీజనింగ్‌కు సంబంధించిన రక్తసంబంధాలు చాప్టర్‌కు ప్రధాన పాత్ర ఉంది. ఈ చాప్టర్‌ నుంచి కానిస్టేబుల్‌, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో రెండు లేదా మూడు ప్రశ్నలు రావచ్చు. ఈ చాప్టర్‌లో నాలుగు మోడల్స్‌పై అభ్యర్థికి అవగాహన అవసరం.

బంధుత్వాలను అర్థం చేసుకుంటే సమాధానం సులువే..!

ప్రతి పోటీపరీక్షల్లోనూ  రీజనింగ్‌కు సంబంధించిన రక్తసంబంధాలు చాప్టర్‌కు ప్రధాన పాత్ర ఉంది. ఈ చాప్టర్‌ నుంచి కానిస్టేబుల్‌, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో  రెండు లేదా మూడు ప్రశ్నలు రావచ్చు. ఈ చాప్టర్‌లో నాలుగు మోడల్స్‌పై అభ్యర్థికి అవగాహన అవసరం.


రక్త సంబంధాలు

ఈ ప్రశ్నలకు సులభంగా సమాధానం రావాలంటే ‘అభ్యర్థి’ తనకు తానే ఆ ప్రశ్నలోని వ్యక్తిగా ఊహించుకోవాలి. అక్కడ ప్రశ్నలో ఇచ్చిన సంబంధాన్ని తన బంధువులతో ఊహించుకొంటూ చేస్తే సమాధానాలు రాబట్టడం సులువు. నిత్యజీవితంలో మానవ సంబంధాలపై చాలా ప్రాముఖ్యత ఉంది.  ఎదుటి వ్యక్తితో మనకు గల సంబంధం దృష్ట్యా ఎవరిని ఎలా పిలవాలో చాలా వరకు మనకు తెలుసు. అయినప్పటికీ ఇక్కడ సబ్జెక్ట్‌పరంగా కొన్ని విషయాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దాని అవసరార్థమై ఈ దిగువ ఇచ్చిన ఫండమెంటల్స్‌ గుర్తించుకోవడం చాలా అవసరం.


ఫండమెంటల్స్‌ 

  • తల్లి సోదరుడు  - మేనమామ
  • మేనమామ భార్య - అత్తయ్య
  • తండ్రి సోదరి  -  మేనత్త
  • మేనత్త భర్త - మామయ్య
  • భార్య లేదా భర్త  తండ్రి - మామగారు
  • భార్య లేదా భర్త  తల్లి - అత్తగారు
  • చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాలి. 


అదేవిధంగా

తల్లి, తండ్రి సోదరి, సోదరుల పిల్లలను ఆంగ్లంలో ‘కజిన్‌’ అంటారు. కజిన్‌కు తెలుగులో సర్తెన అర్థవంతమైన పదం లేదు. కాబట్టి తెలుగులో కూడా ‘కజిన్‌’ అనే ఇస్తున్నారు. అంటే పెదనాన్న, పెద్దమ్మ, బాబాయి, పిన్ని, మేనమామ, మేనత్త

వీరి పిల్లలందరూ(ఆడ, మగ) కూడా ‘కజిన్‌’. బావ, బావమరిది, వదిన, మరదలు అనే విషయాలు ఈ కింద తెలిపిన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలి.


  • సోదరి భర్త -  బావ
  • ఒక పురుషుడికి భార్య సోదరుడు  -  బావమరిది
  • ఒక మహిళకు భర్త సోదరుడు - బావ లేదా మరిది.
  • సోదరుని భార్య - వదిన లేదా మరదలు
  • ఒక మహిళకు భర్త సోదరి - వదిన లేదా మరదలు
  • ఒక పురుషుడికి భార్య సోదరి - వదిన లేదా మరదలు.


పై సందర్భాలలో మాత్రమే బావ, మరిది, వదిన, మరదలు అనే సంబంధాలు పిలవాలి. అంతేకానీ మేనమామ, మేనత్త పిల్లలను కూడా ‘కజిన్‌’ అనే పిలవాలి. గుర్తించుకోగలరు.  


అదే విధంగా నెఫ్యూ, నీస్‌ అనగా మేనల్లుడు, మేనకోడలు అని భావిస్తాం.  కానీ, సబ్జెక్ట్‌ పరంగా సోదరీ, సోదరుల కుమారుడు నెఫ్యూ, సోదరీ, సోదరుల కుమార్తె నీస్‌.  కొన్ని సందర్భాల్లో ఒక మహిళకు సోదరుని కుమారుడు మేనల్లుడు అని, ఒక మహిళకు సోదరుని కుమార్తె మేనకోడలు, ఒక పురుషునికి సోదరి కుమారుడు మేనల్లుడు గాను తెలుగులో కూడా సంబంధాలు ఇస్తారు. ఒకవేళ అలా ఆప్షన్స్‌లో లేనప్పుడు కచ్చితంగా సోదరీ, సోదరుల కుమారుడు నెప్యూ, సోదరీ, సోదరుల కుమార్తె నీస్‌ గానే భావించి దానికి సంబంధించిన ఆప్షన్‌ ఉంటే సమాధానంగా గుర్తించండి.  


  • తండ్రి సోదరుడు - పెదనాన్న లేదా చిన్నాన్న
  • తల్లి లేదా తండ్రి యొక్క కుమారుడు - సోదరుడు
  • తల్లి లేదా తండ్రి యొక్క కుమార్తె - సోదరి
  • తల్లి లేదా తండ్రి యొక్క ఏకేౖక కుమారుడు అతనే (ఏజీఝట్ఛజూజ)
  • తల్లి లేదా తండ్రి యొక్క ఏకైక కుమార్తె ఆమెనే (ఏజీఝట్ఛజూజ)
  • తల్లి యొక్క తల్లి - అమ్మమ్మ
  • తండ్రి యొక్క తల్లి - నాయనమ్మ
  • తల్లి సోదరి - పెద్దమ్మ లేదా చిన్నమ్మ (పినతల్లి, పిన్ని)
  • కుమారుని భార్య - కోడలు
  • కుమార్తె భర్త - అల్లుడు
  • నెఫ్యూ, నీస్‌ల కుమారుడు మనవడు
  • నెఫ్యూ, నీస్‌ల కుమార్తె మనవరాలు
  • కుమారుడు, కుమార్తెల కుమారుడు మనవడు 
  • కుమారుడు, కుమార్తెల కూతురు మనవరాలు

మోడల్‌ - 1 

ఈ మోడల్‌కు సంబంధించిన ప్రశ్నలు ఈ కింది విధంగా డైరెక్ట్‌గా లేదా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పి సంబంధం తెలపమని అడగవచ్చు. ఫొటోలో ఉన్న వ్యక్తిని చూపిస్తూ, పార్కులో ఉన్న వ్యక్తిని చూపిస్తూ, రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తిని చూపిస్తూ, పుస్తకం చదువుతున్న బాలుని చూపిస్తూ, టివి చూస్తున్న వ్యక్తిని చూపిస్తూ అని ఈ విధంగా ఇన్‌డైరెక్ట్‌గా కూడా ఉంటాయి. అందువల్ల అభ్యర్థి మొదట ప్రశ్నను జాగ్రత్తగా అవగాహన చేసుకొని సరైన సమాధానాన్ని గుర్తించాలి.

1) ఫోటోలో గల ఒక వ్యక్తిని చూపిస్తూ, దినకర్‌ ఇలా అంటున్నాడు. ‘‘అతను నా తండ్రి భార్య యొక్క కూతురి కొడుకు’’ అయితే ఫొటోలో గల వ్యక్తి దినకర్‌కు ఏమవుతాడు?

ఎ) సోదరుడు బి) మనుమడు సి) మేనల్లుడు    డి) కొడుకు

సమాధానం: ‘సి’ 

వివరణ: ప్రశ్నముందు అతను అనగా ఫొటోలో గల వ్యక్తి. నా అనగా చెపుతున్న వ్యక్తి దినకర్‌గా పరిగణించాలి.

‘‘అతను నా తండ్రి భార్య యొక్క కూతురి కొడుకు’’

నా తండ్రి భార్య అనగా దినకర్‌ తండ్రి భార్య అనగా దినకర్‌ తల్లి.

నా తండ్రి భార్య యొక్క కూతురు అనగా దినకర్‌ తల్లికి కూతురు అనగా దినకర్‌ సోదరి. నా తండ్రి భార్య యొక్క కూతురు కొడుకు అనగా సోదరి కుమారుడు (మేనల్లుడు) ఫొటోలో గల వ్యక్తి దినకర్‌కు మేనల్లుడు అవుతాడు.

2) పూర్ణిమను పరిచయం చేస్తూ పవిత్ర తన స్నేహితురాలితో ఇలా అంటున్నది. ‘‘ఆమె నా తల్లి సోదరుని భార్యకు ఏకైక కుమార్తె’’ అయితే పవిత్రకు పూర్ణిమ ఏమవుతుంది?

ఎ) వదిన  బి) సోదరి  సి) కజిన్‌   డి) మేనకోడలు

సమాధానం: ‘సి’ 

వివరణ: ఇక్కడ ఆమె అనగా పూర్ణిమ. నా అనగా పవిత్ర (చెప్పేవ్యక్తి ఎల్లప్పుడు ‘నా’ అవుతారు)

నా తల్లి సోదరుడు అనగా పవిత్ర మేనమామ

నా తల్లి సోదరుని భార్య అనగా పవిత్ర అత్తయ్య

నా తల్లి సోదరుని భార్యకు ఏకైక కుమార్తె అనగా మేనమామ, అత్తయ్య కూతురు ‘కజిన్‌’ అవుతుంది.

3) పార్కుకు వెళ్తున్న ఒక వ్యక్తిని చూపిస్తూ పవన్‌ ఇలా అంటున్నాడు. ‘‘అతను నా తండ్రి యొక్క తండ్రికి ఏకైక కుమారుని సోదరి భర్త’’ అయితే అతను పవన్‌కు ఏమవుతాడు?

ఎ) మేనమామ  బి) పెదనాన్న  సి) చిన్నాన్న  డి) మామయ్య

సమాధానం: ‘డి’ 

వివరణ:  ఈ ప్రశ్నలో అతను అనగా పార్కుకు వెళుతున్న వ్యక్తి నా అనగా చెబుతున్న వ్యక్తి పవన్‌గా పరిగణించాలి. 

‘‘అతను నా తండ్రి యొక్క తండ్రికి ఏకైక కుమారుని సోదరి భర్త’’ నా తండ్రి యొక్క తండ్రికి ఏకైక కుమారుడు అనగా పవన్‌ తండ్రి యొక్క తండ్రి అనగా పవన్‌ తాతగారికి ఏకైక కుమారుడు అనగా పవన్‌ తండ్రి.

పవన్‌ తండ్రికి సోదరి భర్త అనగా పవన్‌కి మేనత్తభర్త అనగా ‘మామయ్య’ అవుతారు.


మోడల్‌ - 2

రెండు, మూడో మోడల్‌కు సంబంధించిన ప్రశ్నలకు ‘డయాగ్రమ్స్‌’ ద్వారా సమాధానాన్ని రాబట్టవలసి ఉంటుంది.

డయాగ్రమ్స్‌కు సంబంధించిన విషయాలు:-

+ అనగా మగ వారిని, - అనగా ఆడవారిని గుర్తించాలి.

మనకంటే పెద్దవారు అనగా అప్పర్‌ జనరేషన్‌

అనగా తల్లి, తండ్రి, అత్తగారు, మామగారు, మేనమామ, బాబాయి మొదలైన వారిని పైనకు చూపించాలి,  డైరెక్ట్‌ బ్లడ్‌ రిలేషన్‌ తీసుకోవాలి. అనగా ఒక వ్యక్తికి పైన ‘+’ గుర్తులో గలవారు తండ్రి, ‘-’ గుర్తుతో గలవారు తల్లి, ఒక వ్యక్తికి కింది భాగాన ‘+’ గుర్తుతో కలవారు కుమారుడు, ‘-’ గుర్తుతో గలవారు కుమార్తె, ఒక వ్యక్తికి అదే లైన్‌ (వరుసలో) + గుర్తుతో ఉంటే సోదరుడు ‘-’ గుర్తుతో ఉంటే సోదరి అని అర్థం. మనకంటే చిన్నవారు అనగా లోయర్‌ జనరేషన్‌ అనగా కొడుకు, కూతురు, అల్లుడు, మేనల్లుడు, కోడలు, మేనకోడలు మొదలైన వారిని వారిని కిందకు చూపించాలి.


+LlM- ఇక్కడ L అనగా Mకు తండ్రి పైన ఉన్నారు. M అనగా Lకు కుమారై కింద ఉన్నారు. ఒకే జనరేషన్‌ వారిని ఒకే వరుసలో చూపించాలి. అనగా సోదరుడు, సోదరి, బావ, మరిది, వదిన, కజిన్‌, మరదలు. భార్య, భర్త మొదలైన వారిని ఒకే వరుసలో చూపించాలి.


-P -- Q+

P కి ఖ సోదరుడు. Q కి P సోదరి అని అర్థం (ఒకే వరుసలో ఉంటే ఒకే జనరేషన్‌ వారు.

గమనించాలిః- భార్య, భర్తల సంబంధాన్ని తెలిపేటప్పుడు  

  ఈ గుర్తును ఉపయోగించాలి.

ఉదాః 

X కు Y భార్య అని, Y కి X  భర్త అని అర్థం.

A మరియు B  వివాహిత జంట. X యొక్క తల్లి B. X మరియు Y సోదరులు. Y యొక్క సోదరి K. M యొక్క భర్త X. N యొక్క తండ్రి Y. X యొక్క కుమారుడు Z. P యొక్క కుమార్తె R. R యొక్క తల్లి K.

పై సమాచారాన్ని ఆధారంగా ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు తెలుపండి.


1. Mకు A ఏమవుతారు?

ఎ) అత్తగారు బి) మామగారు సి) అల్లుడు  డి) కోడలు

2. Nకు R ఏమవుతారు?

ఎ) అత్త బి) అత్తయ్య సి) మేనత్త డి) మేనకోడలు

3. X కు R ఏమవుతారు?

ఎ) మేనకోడలు బి) మేనల్లుడు 

సి) మేనమామ డి) మామగారు

4. Yకు P ఏమవుతారు?

ఎ) బావమరిది  బి) బావ  

సి) సోదరి    డి) సోదరుడు

సమాధానాలు:  1 (బి)   2 (సి)   3 (ఎ)   4(బి)

వివరణ: ముందుగా ఇచ్చిన సమాచారానికి రేఖాచిత్రాన్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. పై సమాచారానికి రేఖాచిత్రం ఈ కింది విధంగా ఉంటుంది.

 

సమాధానాలు వివరణలతో:

1. M యొక్క భర్త X. X యొక్క తండ్రి  A అనగా Mకు  A భర్త యొక్క తండ్రి అనగా మామగారు అవుతారు.

2. N యొక్క తండ్రి Y. Y యొక్క సోదరి K. అనగా N కు K తండ్రి యొక్క సోదరి అనగా మేనత్త అవుతారు.

3. X యొక్క సోదరి K. K యొక్క కుమారై R అనగా Xకు R సోదరి కుమార్తె అనగా మేనకోడలు అవుతారు. 

4. Y యొక్క సోదరి  K. K యొక్క భర్త P అనగా Yకు P సోదరి భర్త అనగా బావ అవుతారు.


మోడల్‌ - 3

ఈ మోడల్‌కి సంబంధించిన ప్రశ్నలలో +, -, 4, x, @, & .....  మొదలగు వివిధ గుర్తులతో వ్యక్తుల మధ్య సంబంధాలను తెలుపుతారు. చిన్న సమీకరణం ఇస్తారు. ఆ సమీకరణంలో సంబంధాలను ప్రతిక్షేపించి ఇచ్చిన 4 సమాధానాల్లో సమీకరణం ప్రకారం ఏది సరైనదో కనుగొనాలి. దీనికి ఉదాహరణలు పరిశీలిద్దాం.


ఉదా (1-3) P + Q అనగా  P యొక్క కుమారుడు Q

P - Q అనగా P యొక్క కుమార్తె Q

  P x Q అనగా P యొక్క తల్లి Q

P 4 Q  అనగా P యొక్క భర్త  Q

P = Q అనగా P యొక్క తండ్రి Q


పై సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ కింది ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించండి.

1. సమీకరణం  L+MxN  ప్రకారం ఈ కింది వాటిలో ఏది సత్యం?

ఎ) M  యొక్క తండ్రి N  బి) N  యొక్క కూతురు M

సి) N యొక్క భర్త L  డి) ఏదీకాదు

2. సమీకరణం  K 4 T = R ప్రకారం ఈ కిందివాటిలో ఏదిసత్యం?

ఎ) K యొక్క తండ్రి R  బి) R యొక్క కోడలు  K       

సి)  T యొక్క తల్లి K  డి) ఏదీకాదు

3. సమీకరణం F-DxM=K ప్రకారం ఈ కిందివానిలో ఏది సత్యం?

ఎ)  K  యొక్క అల్లుడు M 

బి) K యొక్క అల్లుడు F   

సి)  F  యొక్క కుమారుడు D    డి) ఏదీకాదు

సమాధానాలు:  1 (సి)  2 (బి)  3(బి)


సమాధానాలు వివరణలతో:

1. సమీకరణం  L+MxN

దీనిని 2 భాగాలుగా విభజించగా సమీకరణం ఈ కింది విధంగా ఉంటుంది.

L + M, M x N. ఇప్పుడు గుర్తులకు బదులుగా ప్రశ్నలో ఇచ్చిన సంబంధాలను ప్రతిక్షేపించగా.

L + M అనగా L  యొక్క కుమారుడు M

M x N అనగా  M యొక్క తల్లి N.

ఈ సమాచారం ప్రకారం రేఖాచిత్రం ఈ కింది విధంగా ఉంటుంది.

పై రేఖాచిత్రం  ప్రకారం ూ యొక్క భర్త ఔ అని తెలుస్తోంది.


2. సమీకరణం K 4 T = R

దీనిని 2. భాగాలుగా విభజించగా సమీకరణం ఈ కింది విధంగా ఉంటుంది.

K 4 T, T = R ఇప్పుడు గుర్తులకు బదులుగా ప్రశ్నలో ఇచ్చిన సంబంధాలను ప్రతిక్షేపించగా.

K 4 T అనగా K యొక్క భర్త T. 

T = Rఅనగా T యొక్క తండ్రి R.

దీని ప్రకారం రేఖాచిత్రం ఈ కింది విధంగా ఉంటుంది.

ప్రక్క రేఖాచిత్రం ప్రకారం ఖ యొక్క కోడలు ఓ అని తెలియుచున్నది.

3. సమీకరణం  F - D x M = K

దీనిని 3 భాగాలుగా విభజించగా సమీకరణం ఈ కింది విధంగా ఉంటుంది.

F - D, D x M, M = K

ఇప్పుడు గుర్తులకు బదులుగా ప్రశ్నలో ఇచ్చిన సంబంధాలను ప్రతిక్షేపించగా

F - D  అనగా F  యొక్క కుమార్తె D

D x M అనగా  D యొక్క తల్లి M

M = K అనగా M యొక్క తండ్రి  K

దీని ప్రకారం రేఖాచిత్రం ఈ కింది విధంగా ఉంటుంది.

రేఖాచిత్రం ప్రకారం K యొక్క అల్లుడు F అని తెలియుచున్నది.


మోడల్‌ - 4

ఈ మోడల్‌కి సంబంధించిన ప్రశ్నలలో  +, -, x మరియు 4 లేదా @, $, #, *  మొదలగు.  వివిధ రకాలైన గుర్తులతో వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలుపుతారు. ఆ సంబంధాలను గుర్తులకు బదులుగా మార్చుకొని జాగ్రత్తగా పరిశీలిస్తూ సమాధానాన్ని రాబట్టాలి. 


ఉదా(1)  A + B అనగా A యొక్క కుమారుడు  B

A 4 B  అనగా A యొక్క కూతురు B

A x B  అనగా A యొక్క కోడలు B

A - B అనగా A యొక్క తల్లి B

K  యొక్క తండ్రి Y అవ్వాలంటే ఈ కింది వానిలో ఏ సమీకరణం సత్యము?


ఎ) P + Q 4T x K - Y    బి) P + Y - Q x T 4 K  

సి) P - Y + Q 4 T x K డి) P x Q -T 4 Y 4 K 

 

సమాధానంః ‘బి’ అవుతుంది. 


వివరణ: ముందుగా  Aను పరిశీలిద్దాం. 

P + Q 4 T x K - Y

+ అనగా కుమారుడు కావున P యొక్క కుమారుడు Q

4 అనగా కూతురు కావున  Q యొక్క కూతురు  T

x అనగా కోడలు కావున T యొక్క కోడలు  K

-  అనగా తల్లి కావున K యొక్క తల్లి Y 

ఈ సమాచారాన్ని పరిశీలీస్తే Kకు తల్లి 

Y అని చివరి పాయింట్‌లో ఉంది.  కావున ప్రశ్నకు సమాధానం ‘ఎ’ కాదు. తరవాత ‘బి’ని పరిశీలిద్దాం. 

P + Y - Q x T 4 K

గుర్తుల స్థానంలో సంబంధాలను రాయగా P యొక్క కుమారుడు Y.   Y  యొక్క తల్లి Q. Q  యొక్క కోడలు T. T యొక్క కుమార్తె K. దీని ప్రకారం రేఖా చిత్రం ఈ కింద విధంగా ఉంటుంది. 


ఈ డయాగ్రామ్‌ను పరిశీలించి K తల్లి T, T కు తండ్రి Y అని తెలియుచున్నది. కావున సమాధానం ‘బి’ అవుతుంది. 


-పండిటి మీనాక్షి పవన్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ



Updated Date - 2022-07-02T20:09:32+05:30 IST