చాణక్య నీతి: ఇటువంటి ప్రవర్తన కలిగినవారిని నిత్యం కష్టాలు వెంటాడుతాయి.. వారు ఏం చేయాలంటే..

ABN , First Publish Date - 2022-02-12T12:24:09+05:30 IST

ఆచార్య చాణక్య గురించి చెప్పేటప్పుడు.. చంద్రగుప్త మౌర్య..

చాణక్య నీతి: ఇటువంటి ప్రవర్తన కలిగినవారిని నిత్యం కష్టాలు వెంటాడుతాయి.. వారు ఏం చేయాలంటే..

ఆచార్య చాణక్య గురించి చెప్పేటప్పుడు.. చంద్రగుప్త మౌర్య అనే సాధారణ పిల్లవాడు.. చాణక్యుని ఆలోచనలను స్వీకరించి మగధ సామ్రాజ్యాన్ని పాలించాడని చెబుతారు. చాణక్య తెలిపిన జీవన విధానాలు ప్రభావవంతంగా ఉంటాయి. చాణక్యునికి రాజకీయాలకే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన అవగాహన ఉంది. ఆచార్య చాణక్య.. జీవన విధానాలను రూపొందించారు. దానిలో సమాజంలోని దాదాపు ప్రతి అంశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు.. ఆచార్య చాణక్యుని జీవన విధానాల పుస్తకంలో కనిపిస్తాయి. లైఫ్ కోచ్‌గా పేరొందిన చాణక్య.. ఒక వ్యక్తి తన ప్రవర్తన ద్వారా జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును ఎలా పొందవచ్చో తెలిపారు. ఈ కోవలోనే ఆచార్య చాణక్య.. జీవితంలో తరచూ నష్టాన్ని, వైఫల్యాన్ని ఎదుర్కొనే వారి గురించి కూడా తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సమయ ప్రాముఖ్యత

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం సమయానికున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోని వారు తరచూ వైఫల్యాలను ఎదుర్కొంటారు. అలాంటివారు కష్టాలలో కూరుకుపోతారని ఆచార్య చాణక్య తెలిపారు. నిజానికి గడిచిన కాలం తిరిగి రాదు. ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్థిరమైన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని ఆచార్య చాణక్య సూచించారు.


కోపం

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం కోపం అనేది వ్యక్తికి అతిపెద్ద శత్రువు. కోపాన్ని అదుపు చేసుకోలేని వారు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాదు వారిని వైఫల్యం కూడా వెంటాడుతుంది. నిజానికి కోపంతో ఊగిపోయే వారిని చుట్టుపక్కలవారు ఇష్టపడరు. అలాగే అలాంటి వారి పక్కన కూర్చునేందుకు కూడా ఇష్టపడరు. 

ఆదాయానికి మించిన ఖర్చులు

చాణక్య నీతిలోని వివరాల ప్రకారం మనమందరం మన ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేయాలి. కొందరు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇటువంటి వారి ఈ అలవాటు వల్ల ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే డబ్బు విషయంలో పొదుపుగా ఉండాలని, అప్పుడే ఆర్థిక సమస్యలు ఎదురుకావని ఆచార్య చాణక్య తెలిపారు. 

డబ్బు వృథా

చాణక్య నీతి ప్రకారం.. సంపదకు దేవత మహాలక్ష్మీ అమ్మవారు. చంచల స్వభావం కలవారి ఇంట లక్షీదేవి నివసించదు. లక్ష్మీదేవి అనుగ్రహం కారణంగా ధనం లభించినట్లయితే.. ఆ డబ్బు వృథా కాకుండా చూసుకోవాలి. డబ్బును అనవసర ఖర్చులకు వినియోగిస్తే తరువాత చింతించాల్సివస్తుందని ఆచార్య చాణక్య సూచించారు. 

Updated Date - 2022-02-12T12:24:09+05:30 IST