Abn logo
Sep 21 2021 @ 01:26AM

ఈ జపనీయులు.. బామ్మలకే బామ్మలు

టోక్యో, సెప్టెంబరు 20: జపాన్‌కు చెందిన ఇద్దరు వృద్ధ సోదరీమణులు.. 107ఏళ్ల 330రోజుల వయసు పూర్తి చేసుకొని.. ఇప్పటి వరకూ ఉన్న ‘అత్యధిక వయసు కవలల’ గిన్నీస్‌ రికార్డును బద్ధలు కొట్టారు. యుమెనో సుమియామా, కౌమె కొడామాలను.. జీవించి ఉన్న కవలల్లో అత్యధిక వయసు కలిగిన వారిగా గిన్నిస్‌ గుర్తించింది. ఇప్పటి వరకూ ఈ రికార్డు.. 107ఏళ్ల 175రోజులుతో అదే దేశానికి చెందిన కవలలు కిన్‌ నారిటా, గిన్‌కానీ పేరున ఉండేది.


యుమెనో, కౌమేలు 1913 నవంబరు 5న షోడోషిమా దీవిలో జన్మించారు. ఇక, వయసు మళ్లిన వారి జనసంఖ్యలో ప్రపంచంలోనే  జపాన్‌ ముందుంది. సుమారు 12.5కోట్ల జనాభాలో 29శాతం మందికి 65ఏళ్లు నిండిపోయాయి. వాళ్లలో నూరేళ్లు నిండిన వారు 86,510మంది ఉన్నారని ఆ దేశ సంక్షేమ మంత్రిత్వశాఖ పేర్కొంది.