కాలుష్య కోరల్లో ఉన్న భారత నగరాలు ఇవే..

ABN , First Publish Date - 2021-11-17T00:58:47+05:30 IST

ఢిల్లీతో పాటు దేశంలోని అనేక నగరాలు కూడా తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నగరాల్లో ఉన్న ప్రజలు కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండిక్స్ మంగళవారం..

కాలుష్య కోరల్లో ఉన్న భారత నగరాలు ఇవే..

న్యూఢిల్లీ: దేశంలో కాలుష్య పరిస్థితి రోజు రోజుకూ భయానక పరిస్థితికి చేరుతోంది. గత మూడు సంవత్సరాలుగా ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో మన దేశ రాజధాని ఢిల్లీ మొదటి వరుసలో ఉంది. ఢిల్లీ కాలుష్య పరిస్థితిపై సుప్రీంకోర్టు తాజాగా మరోమారు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానిక, కేంద్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.


కాగా, ఢిల్లీతో పాటు దేశంలోని అనేక నగరాలు కూడా తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నగరాల్లో ఉన్న ప్రజలు కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండిక్స్ మంగళవారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఢిల్లీ సహా మానేసర్, జింద్ నగరాల్లో వాయుకాలుష్యం అత్యంత భయానక పరిస్థితికి చేరుకుంది. ఇవి సహా అంకాలేశ్వర్, బాఘ్‌పట్, బహదూర్‌ఘర్, బల్లాబ్‌గర్, భివండి, భోపాల్, చర్కి దాద్రి, దారుహెర, ఫరిదాబాద్, ఫతేహాబాద్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, హాపూర్, హిసార్, కత్ని, కోటా, మండిఖేరా, మీరట్, మొరాదాబాద్, మోతిహరి, ముజఫర్‌పూర్, నార్ముల్, నోయిడా, పానిపట్, రోహ్తక్, సిస్రా, సోనిపట్, యమునా నగర్ నగరాల్లో కాలుష్యం తీవ్ర ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబద్‌లో కొంత మేరకు ఆరోగ్యకరంగానే ఉందని, ఆంధ్రాలోని విశాఖపట్నంలో వాతావరణ పరిస్థితి బాగుందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తెలిపింది.

Updated Date - 2021-11-17T00:58:47+05:30 IST