చాణక్య నీతి: ఈ అలవాట్లు మనిషిని పేదవాడిని చేస్తాయి.. ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు!

ABN , First Publish Date - 2022-06-30T11:56:04+05:30 IST

నేటి కాలంలో మనిషి డబ్బు కోసం అన్ని రకాల...

చాణక్య నీతి: ఈ అలవాట్లు మనిషిని పేదవాడిని చేస్తాయి.. ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు!

నేటి కాలంలో మనిషి డబ్బు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే కష్టపడి పనిచేయాలనే ఉత్సాహాన్ని కలిగివున్నవారిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని ఆచార్య చాణక్య తెలిపారు. లక్ష్మీదేవికి మనిషికున్న కొన్ని అలవాట్లు కోపం తెప్పిస్తాయన్నది ఆచార్య నమ్మకం. ఈ అలవాట్లను సకాలంలో సరిదిద్దుకోకపోతే, లక్ష్మి ఆ ఇంట్లో ఉండదు. ఇంటి చుట్టూ మురికి ఉండేవారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. అటువంటి ప్రదేశంలో దుఃఖం, పేదరికం తాండవిస్తాయి. 


లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంటిని మాత్రమే కాకుండా శరీరం, దంతాలు, బట్టల శుభ్రతపై శ్రద్ధ వహించాలి. ఆచార్య చాణక్యుడు అవసరానికి మించి ఆహారం తీసుకునే వారు కూడా ధనవంతులు కాలేరని చెబుతాడు. అలాంటి వారిని అనారోగ్య సంబంధిత సమస్యలు వెంటాడుతాయి. ఈ సమస్యల పరిష్కారంలో వారి డబ్బు వృథా అవుతుంది. అలాంటి వారు ఎంతప్రయత్నించినా డబ్బు ఆదా చేయలేరు. కటువుగా మాట్లాడే వారు మంచి అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేరు. ఇటువంటివారి మాటలు ఇతరుల మనసును గాయపరుస్తాయి. అలాంటి వారిపై లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోయే వారిపై లక్ష్మీదేవి కోపగిస్తుంది. అలాంటి వారు బద్ధకంతో నిండి ఉంటారు. పెద్దపెద్ద కలలు కంటారు... కానీ ఏ పనీ చేయరు. అన్యాయం, కుతంత్రం, మోసం చేసి డబ్బు సంపాదించే వ్యక్తుల దగ్గర డబ్బు ఎంతోకాలం నిలవదు. అలాంటివారు అన్నింటినీ కోల్పోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం వారిపై ఎప్పుడూ ఉండదు. అందుకే మనిషికి సక్రమమైన సంపాదన అవసరమని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-06-30T11:56:04+05:30 IST