ప్రపంచంలోని ఆ దేశాల్లో నేటికీ రైల్వే లైన్ లేదు... కారణం ఇదే!

ABN , First Publish Date - 2022-02-09T16:22:01+05:30 IST

రైల్వే నెట్‌వర్క్ అనేది ప్రపంచంలోనే..

ప్రపంచంలోని ఆ దేశాల్లో నేటికీ రైల్వే లైన్ లేదు... కారణం ఇదే!

రైల్వే నెట్‌వర్క్ అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రవాణా వ్యవస్థ. చాలా దేశాల్లో ఫాస్ట్ రైళ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు పరుగులు తీస్తున్నాయి. రైల్వే నెట్‌వర్క్ చరిత్ర గ్రీస్‌తో ముడిపడి ఉంది. 6వ శతాబ్దం నుంచి రైలు నెట్‌వర్క్ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ప్రపంచంలోని వందలాది దేశాలలో రైల్వే నెట్‌వర్క్ అత్యంత ఆదరణ పొందిన రవాణా వ్యవస్థ. ఇంత ఘనత ఉన్నప్పటికీ ఇప్పటికీ రైలు రవాణా లేని కొన్ని దేశాలు ఉన్నాయి. ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. రైలు వ్యవస్థ లేని ఆ దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అండోరా

అండోరా.. జనాభా పరంగా ప్రపంచంలో 11వ అతి చిన్న దేశం విస్తీర్ణం పరంగా 16వ స్థానంలో ఉంది. కానీ అండోరాలో రైల్వే నెట్‌వర్క్ లేదు. సమీప స్టేషన్ ఫ్రాన్స్‌లో ఉంది. ఈ దేశానికి చేరుకోవడానికి ఇక్కడి నుండి బస్సు సర్వీసు ఉంది. 

భూటాన్

భూటాన్ దక్షిణాసియాలోని అతి చిన్న దేశం. ఇప్పటివరకు ఈ దేశంలో రైల్వే నెట్‌వర్క్ లేదు. అయితే భూటాన్‌లోని దక్షిణ భాగాన్ని భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించాలనే యోచన ఉంది. నేపాల్‌లోని టోరిబరీని పశ్చిమ బెంగాల్‌లోని హషిమారాతో అనుసంధానించాలని భారత్ ప్లాన్ చేసింది. 


సైప్రస్

ప్రస్తుతం, సైప్రస్‌కు ఎటువంటి రైల్వే నెట్‌వర్క్ లేదు. అయితే ఈ దేశంలో రైల్వే నెట్‌వర్క్ 1905 నుండి 1951 వరకు ఉంది. ఆ రైలు 76 మైళ్లు ప్రయాణించి 39 స్టేషన్ల గుండా వెళ్లేది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ రైలు 1974 నుంచి నిలిచిపోయింది. 

తూర్పు తైమూర్

తూర్పు తైమూర్‌లో కమ్యూనికేషన్ నెట్‌వర్క్, రవాణా మౌలిక సదుపాయాల పరిస్థితి చాలా తక్కువగా ఉంది. తూర్పు తైమూర్‌లో రైల్వే నెట్‌వర్క్ లేదు. ఈ దేశం యొక్క ప్రాథమిక రవాణా వ్యవస్థ బస్సు రహదారి మరియు అది కూడా చాలా అధ్వాన్నంగా ఉంది.

గినియా-బిస్సౌ

పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న గినియా-బిస్సౌ.. రైల్వే నెట్‌వర్క్‌ను లేని కొన్ని ఆఫ్రికన్ దేశాలలో ఒకటి.  గినియా-బిస్సౌ 1998లో పోర్చుగల్‌తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దేశంలో రైల్వే నెట్‌వర్క్ నిర్మాణం కోసం ఈ ఒప్పందం కుదిరింది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరగలేదు.

ఐస్లాండ్

ఐస్లాండ్‌లో మూడు రైల్వే నెట్‌వర్క్‌లు ఉన్నాయి. కానీ దేశంలో ఎప్పుడూ పబ్లిక్ రైల్వే నెట్‌వర్క్ లేదు. 1900ల ప్రారంభంలో దేశంలో రైల్వే నెట్‌వర్క్ కోసం అనేక ప్రతిపాదనలు చేశారు. అయితే అవన్నీ తిరస్కరణకు గురయ్యాయి. 2000వ సంవత్సరంలో దేశ రాజధానిలో రైలు ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన కొత్త ప్రణాళికను తీసుకువచ్చారు.

కువైట్

ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం కువైట్. అయినప్పటికీ ఇక్కడ రైలు నెట్‌వర్క్ లేదు. ప్రస్తుతం, కువైట్‌లో అనేక రైల్వే ప్రాజెక్టులను ప్లాన్ చేశారు. కువైట్ సిటీ - ఒమన్ మధ్య 1200 మైళ్ల పొడవైన గల్ఫ్ రైల్వే నెట్‌వర్క్‌కు ప్రణాళిక రూపొందించారు.

లిబియా

అంతర్యుద్ధం సమయంలో లిబియాలోని అన్ని రైల్వే లైన్లు ధ్వంసం అయ్యాయి. 1965 నుండి లిబియాలో రైల్వే నెట్‌వర్క్ లేదు. లిబియాలో పలు రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఈ దేశాలతో పాటు, మకావు, మాల్టా, మార్షల్ దీవులు, మారిషస్, మైక్రోనేషియా, నైజర్, ఒమన్, ఖతార్, రువాండా, శాన్ మారినో, సోలమన్ దీవులు, సోమాలియా, సురినామ్, టోంగా, ట్రినిడాడ్ మరియు టొబాగో, తువాలు, వనాటు మరియు యెమెన్‌లలో కూడా రైలు నెట్ వర్క్ లేదు. 


Updated Date - 2022-02-09T16:22:01+05:30 IST