Advertisement

అప్పట్లో నలుపు.. ఇప్పుడు మెరుపు.. ఈ అందగత్తెల్ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

దీపికా పదుకొణే... ప్రస్తుతం బాలీవుడ్‌ని ఏలుతోన్న మకుటం లేని మహారాణి. అయితే, ఈ నంబర్ వన్ బ్యూటీ ఒకప్పుడు  ఇంతలా మెరిసిపోయేది కాదు. కాస్త బ్రౌనిష్‌గా దర్శనం ఇచ్చేది. కానీ, ‘ఓం శాంతి ఓం’ నాటి డెబ్యూ బ్యూటీకి, ఈనాటి ‘పఠాన్’ సుందరికి ఎంత వ్యత్యాసమో చాలా తేలిగ్గా పసిగట్టేయవచ్చు! ఇలా దీపంలా మెరిసిపోవటానికి దీపిక ఏం చేసిందో... ప్రస్తుతానికైతే ‘సీక్రెట్టే’!

బాలీవుడ్ వదిలి హాలీవుడ్‌కి ఎగరి వెళ్లిపోయిన డస్కీ దేసీగాళ్ ప్రియాంక చోప్రా ఇప్పటికీ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఏం కాదు. ఆమె పోటీ పడాల్సిన సాటి హాలీవుడ్ హీరోయిన్స్‌తో పోలిస్తే ‘కాస్త కలర్ తక్కువే’ అనక తప్పదు. అయితేనేం, అందానికి అస్సలు కొదవలేదు మన పీసీలో! అందుకే, నిక్ జోనాస్ ఈ బ్రౌన్ బ్యూటీకి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు! కాకపోతే, ప్రియాంక కూడా కెరీర్ మొదట్లోకి ఇప్పటికీ చాలా మారిపోయింది. ఏ విధంగానో... అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా తెల్లగా మెరిసిపోతోంది! 

బెంగాలీ రసగుల్లా బిపాషా కూడా బ్లాక్ బ్యూటీనే. ఇప్పటికీ ఆమె డస్కీ లుక్స్ అంటే కుర్రాళ్లు పడి చచ్చిపోతారు. అంతటి సెక్స్ అప్పీల్ ఉన్న ఆమె చాలా ఏళ్ల కింద మరీ డార్క్‌గా ఉండేది. ఇప్పుడు మాత్రం, ఏ ఫెయిర్‌నెస్ క్రీమ్ మహిమోగానీ, బాగా తెల్లబడింది!

తెలుగు వారి ‘సాగరకన్య’ శిల్పా శెట్టి ఏజ్ ఎంత పెరిగినా రూపాన్ని మాత్రం మారనివ్వటం లేదు. ఎవరో మహాశిల్పి చెక్కిన చక్కని శిల్పంలా శిల్పా ఇప్పటికీ దర్శనం ఇస్తుంది. అయితే, ఆమె కలర్ కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. మొదట్లో శిల్పా శెట్టి చాలా డస్కీగా ఉండేది...

కాజోల్ దేవగణ్... ఈ బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ‘ఫెయిర్’ ఎప్పుడూ కాదు. అలాగనీ ‘ఫెంటాస్టిక్’ కాదని అంటే మాత్రం తప్పే! కాజోల్ నవ్వుతోనే ఆకట్టుకునే ఆహ్లాదకర అందగత్తె! అయితే, కాజోల్ తాను ఫెయిర్‌నెస్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు వచ్చిన పుకార్లని తీవ్రంగా ఖండించింది. అలాంటిదేం లేదని తేల్చి చెప్పింది. కానీ, ఆమె కెరీర్ మొదట్లోని ఫోటోలు, ఇప్పటి పిక్స్ చూసినట్టైతే... తేడా స్పష్టంగా తెలిసిపోతుంది!

ఈ తరంలోనే కాదు అలనాటి అందాల రాశులు కూడా కాలంతో పాటూ మరింతగా కళకళలాడిపోతు వచ్చారు. అతిలోక సుందరి శ్రీదేవి దక్షిణాది చిత్రాలకి, ఆమె బాలీవుడ్ స్టిల్స్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాగే, ఆమె యంగ్ లుక్స్‌లో కాస్త డస్కీగా ఉండటం, వయసు పెరిగేకొద్దీ తెల్లగా మారటం... మనం గమనించవచ్చు! 

‘డ్రీమ్ గాళ్’గా పేరుబడ్డ ఎవర్ గార్జియస్ హేమా మాలిని కూడా ఒకప్పుడు నలుపే. మరీ డార్క్‌ కాంప్లెక్షన్ కాకపోయినప్పటికీ... ఆమె ఇప్పటి కంటే గతంలో తక్కువ రంగుతో కనిపించేది. ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆమెలో  మెరుపు కూడా అధికం అవుతోంది!

బాలీవుడ్‌లో లెజెండ్రీ స్టేటస్ సంపాదించుకున్న సౌత్ లేడీ రేఖ. ఈమె పోటోలు కూడా అప్పటి నుంచీ ఇప్పటి దాకా గమనిస్తే... కాలం తెచ్చిన ఆ అదనపు కాంతి ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఇలా రంగుదేలిన అందాల రాశులు అందరూ ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నారని భావించాల్సిన పనేం లేదు. గతంలో కంటే ఇప్పుడు మేకప్ టెక్నిక్స్‌లో వచ్చిన మార్పు, కాస్మోటిక్స్ రంగంలో వచ్చిన విప్లవం... ‘ఎక్స్‌ట్రా ఫెయిర్‌నెస్‌’కి కారణం అనుకోవచ్చు!   

Advertisement

Bollywoodమరిన్ని...